సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thella kaagitham: 'తెల్ల కాగితం’ టీజర్ వచ్చేసింది

ABN, Publish Date - Sep 05 , 2026 | 12:16 PM

యువ కథానాయకుడు హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న  ‘తెల్ల కాగితం’ సినిమా టీజర్ ను మేకర్స్ శనివారం విడుదల చేశారు.  

యువ కథానాయకుడు హర్ష్ రోషన్(Harsh roshan), నక్షత్ర (Nakshatra) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’ (Thella Kagitham). దీపక్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నందు సవరిగాన కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.  అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై  కృష్ణ కొమ్మలపాటి  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ  సినిమా సినిమా టీజర్ ను దిల్ రాజు విడుదల చేశారు.

''ఇప్పుడు తెల్లకాగితం లాంటి జీవితం ఎవరికీ ఉండదు. మనం మంచిగా ఉంటే కూడా కొందరు బ్రతకనివ్వరు. అలాంటప్పుడు మంచిగా ఉండకూడదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదొక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. తెల్లకాగితంపై ఎర్రమచ్చ పడకూడదనేదే ఈ సినిమా. కథ, పాత్రలు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. యువతతో పాటు అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను” అని దిల్ రాజు అన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 01:34 PM