Vishwambhara: OTT డీల్‌ కోసమే ఎదురుచూపులు.. డీల్‌ లాక్ అయితే రిలీజ్ డేట్‌ ఫిక్స్!

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:23 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై ఆసక్తికరమైన అప్‌డేట్  నెట్టింట వైరల్ అవుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై (Vishwambhara) ఆసక్తికరమైన అప్‌డేట్  నెట్టింట వైరల్ అవుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే టెక్నికల్ వర్క్ దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి రీ-రికార్డింగ్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చిందని చిత్రబృందం నుంచి సమాచారం అందింది.

అలాగే ఫైనల్ అవుట్‌పుట్‌పై టీమ్ సంతృప్తిగా ఉందట. అయితే ‘విశ్వంభర’ థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి ప్రధాన కారణం OTT డీల్ ఇంకా లాక్ కాకపోవడమే అని తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్ డేట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాకు సంబంధించిన టెక్నికల్ పనులు దాదాపు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి బిజినెస్ వ్యవహారాలపైనే ఉంది. OTT డీల్ సెటిల్ అయిన వెంటనే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో త్రిష కథానాయిక. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. 

Updated Date - Sep 05 , 2026 | 12:13 PM