ఇత‌నే నా ల‌వ‌ర్‌.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:07 PM

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌, అడ‌పాడ‌ద‌పా సినిమాల‌తో జ‌నాల‌కు బాగా చేరువ‌యిన ప్ర‌ముఖ ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్ జైత్రీత‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చింది.

Jaiyetri Makana

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌, అడ‌పాడ‌ద‌పా సినిమాల‌తో జ‌నాల‌కు బాగా చేరువ‌యిన ప్ర‌ముఖ ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్ జైత్రీ (Jaiyetri Makana) త‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. నేను ల‌వ్‌లో ఉన్నాను.. ఇత‌నే నా ల‌వ‌ర్ అంటూ వారిరువురు క‌లిసి ఉన్న ఫొటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసి అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల జైత్రీ యూట్యూబ్‌లో అంత‌గా క‌నిపించ‌కున్నా ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ హ్యాపీగా లీడ్‌ చేస్తోంది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు క‌లిసి శ్రీలంక‌లో విహార‌యాత్ర‌లో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

Jaiyetri Makana

అయితే.. గ‌డిచిన ఐదారేండ్ల‌లో త‌ను న‌టించిన అనేక యూ ట్యూబ్ వీడియోలు మిలియ‌న్ల వ్యూస్ ద‌క్కించుకుని ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లోకి ఉంటుంటాయి. ఈ క్ర‌మంలోనే త‌న నిత్యం ఇండ్ల‌లో జ‌రిగే చిన్న చిన్న అంశాల‌ను లీడ్ గా చేసుకుని చేసిన వీడియోల‌తో కుటుంబ స‌భ్యులు, జ‌న్ జీ యూత్‌కు బాగా చేర‌వ‌యింది. ఫాలోవ‌ర్ల‌ను సైతం గ‌ట్టిగానే సంపాదించుకుంది.

Jaiyetri Makana

అలాంటిది స‌డ‌న్‌గా జైత్రీ నా ల‌వ‌ర్ ఇత‌నే అంటూ అఫీసియ‌ల్‌గా ప్ర‌క‌టించడం ఆమో ఫ్యాన్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా అనేక మంధి ఫ్యాన్స్‌, ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అయితే జైత్రీ ప్రేమించిన వ్య‌క్తి ఎవ‌రు, ఏం చేస్తుంటాడ‌నే అనే విష‌యాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

Jaiyetri Makana

Updated Date - Sep 05 , 2026 | 01:35 PM