సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Aug 04 , 2026 | 02:11 PM

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

నాని సమర్పణలో మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వంలో నితిన్ నటించనున్న ‘అలియాస్ రుక్మిణి’ నుంచి గ్లింప్స్ విడుదలైంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ ‘ఇరుముడి’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘యాలలో యాలలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా హేషమ్ అబ్దుల్ వహాబ్, సాధిక కే.ఆర్ పాడారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డితో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ నుంచి ట్రైలర్ విడుదలైంది.

అతీంద్రియ శక్తులు, మంత్రతంత్రాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. కేకే తెరకెక్కించిన ఆఖరి చిత్రం ‘కింగ్ జాకీ క్వీన్’ ఆగస్టు 7న విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా మూవీ విశేషాలను పంచుకున్నారు. అక్కినేని నాగార్జున 100వ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీశ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మౌళి హీరోగా, శ్రీను కంబాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మూవీకి ‘దొంగ నా కొడుకు’ టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?

తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

Updated Date - Aug 04 , 2026 | 02:16 PM