తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే
ABN , Publish Date - Aug 03 , 2026 | 08:40 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ‘కెజియఫ్, సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. ఈ మూవీకి సంబంధించి వస్తున్న గాసిప్స్‌కు సమాధానమిదే.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR).. ‘కెజియఫ్, సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon). ఈ క్రేజీ కాంబో మొదటిసారి సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన స్పెషల్ టీజర్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, తారక్ ఇంటెన్స్ అండ్ మాస్ లుక్ చూసిన అభిమానుల ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అలరించబోతోంది. బాలీవుడ్ దిగ్గజ నటులు అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటిస్తూ ఈ ప్రాజెక్ట్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన దడదడలాడించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరోసారి థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఆందోళనకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు తారక్ ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, తారక్ సురక్షితంగా ఉన్నారు’ అని ఆయన టీమ్ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, భుజం గాయం కారణంగా ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటుండటంతో ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తిగా నిలిచిపోయిందని, దీనివల్ల సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉందంటూ నెట్టింట ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు తేల్చిచెప్పాయి.
ఎన్టీఆర్ గాయం కారణంగా సినిమా చిత్రీకరణ ఎక్కడా ఆగలేదని.. మేకర్స్ ఏమాత్రం సమయం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారట. ప్రస్తుతం తారక్ ప్రమేయం లేని కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇతర నటీనటుల కాంబినేషన్ సీన్స్, స్వతంత్రంగా పూర్తి చేయగలిగే టాకీ పార్ట్‌ను ఫాస్ట్ మోడ్‌లో పూర్తి చేస్తున్నారు. మరోవైపు తారక్ కూడా స్పీడ్‌గా కోలుకుంటున్నారని, ఆయన పూర్తి స్థాయిలో రెడీ అయిన వెంటనే మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. కాబట్టి ‘డ్రాగన్’ వచ్చే ఏడాది జూన్ 11న అనుకున్న సమయానికే బాక్సాఫీస్ బరిలో దిగుతుందని స్పష్టమవుతోంది. మరి ఈ సినిమాతో తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాలి!.
ఇవి కూడా చదవండి:
‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఆ వివాదానికి సూర్య చెక్ పెట్టనున్నారా
‘కొరియన్ కనకరాజు’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది