Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక
ABN, Publish Date - Sep 10 , 2026 | 01:26 PM
వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.
విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో వస్తోన్న ‘రణబాలి’ నుంచి టీజర్ విడుదలైంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనలను ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ అక్టోబర్ 16న విడుదల కానుంది. అనీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ వెంకీ కుడుముల నిర్మిస్తోన్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. మహేశ్ ఉప్పల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ మల్లన్న క్రియేషన్స్ పతాకంపై కురువ జమన్న నిర్మించిన ‘ఐ బొమ్మ’ నుంచి ట్రైలర్ విడుదలైంది. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన ‘కాగితం పడవలు’ ట్రైలర్ విడుదలైంది. ఎంజీఆర్ తుకారాం తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్
జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్
200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ