Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక
ABN, Publish Date - Sep 25 , 2026 | 03:33 PM
వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.
రామ్ చరణ్ - సుకుమార్ చిత్రం విజయదశమి నాడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు టాక్. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ 15 కిలోలు తగ్గి అల్ట్రా-స్లిమ్ లుక్‌లోకి మారారట. ప్రభాస్ ‘కల్కి 2’లో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ షూటింగ్ 30 శాతం పూర్తి అయినట్లు సమాచారం. ప్రభాస్ డేట్స్ ఖరారవ్వగానే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందట.
అల్లు అర్జున్, అట్లీ ‘రాకా’ చిత్రంలో రశ్మిక మందన్న పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందట. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రెగ్యులర్ హీరోయిన్‌గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుందట. కథను మలుపు తిప్పే ఈ క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. డైరెక్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా ‘జార్జ్ క్రిష్’ చిత్రం నుంచి ‘ఫస్ట్ బూస్టర్’ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
కథల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ స్ట్రిక్ట్ రూల్స్.. ఎందుకంటే
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఊసేది.. ‘ఏకే 47’ పాటేది.. అసలేం జరుగుతుంది?
ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ టీమ్ చేయాల్సింది ఇదేనా..