‘హనుమాన్ అంశ్’ తెలుగు ఊసేది.. ‘ఏకే 47’ పాటేది.. అసలేం జరుగుతుంది?

ABN , Publish Date - Sep 24 , 2026 | 09:43 PM

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్‌ల చుట్టూ ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఆయనకు సంబంధించి ఇప్పుడు రెండు చిత్రాల అప్డేట్స్ ఏంటనేది తెలియాల్సి ఉంది.

Trivikram Srinivas Projects

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ప్రాజెక్ట్‌ల చుట్టూ ప్రస్తుతం గందరగోళం నెలకొంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House No 47). మంచి అంచనాలున్న ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, అనివార్య కారణాలతో అక్టోబర్ 9కి విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ మారడం ఒక ఎత్తైతే.. సినిమా ప్రమోషన్స్, అప్‌డేట్స్ విషయంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం దగ్గుబాటి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.


ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించి మొదటి సింగిల్ ‘నారాయణమ్మ’ విడుదలపై సెప్టెంబర్ 21న మేకర్స్ అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కానీ ఆ ప్రకటన వచ్చి రోజులు గడుస్తున్నా పాట మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. కనీసం పాట విడుదల ఎందుకు ఆలస్యమైంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి వివరణ రాకపోవడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురిచేస్తోంది. విడుదలకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్‌లో ఎందుకింత స్లోగా ఉన్నారనేలా సర్వత్రా టీమ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇదిలా ఉంటే, మరోవైపు త్రివిక్రమ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరిగిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ను సెప్టెంబర్ 18నే రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చలనం లేదు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నారనే ప్రచారం కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటు దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అప్‌డేట్స్ ఆగిపోవడం, ఇటు సమర్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో.. అసలు త్రివిక్రమ్ కాంపౌండ్‌లో ఏం జరుగుతోందంటూ నెటిజన్లు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి ఈ సస్పెన్స్‌కు తెరదించుతారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ టీమ్ చేయాల్సింది ఇదేనా..

‘ద ప్యారడైజ్’ వచ్చేది ఏ ఓటీటీలో అంటే..

శర్వా ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ విడుదల.. ఎలా ఉందంటే

Updated Date - Sep 24 , 2026 | 09:43 PM