Rapid Chitram: ఎన్టీఆర్ యూరప్ ట్రిప్, వెంకీ ‘ఏకే47’.. ఇంకా మరిన్ని అప్‌డేట్స్
ABN, Publish Date - Oct 08 , 2026 | 04:15 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణీతతో యూరప్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ముందే సతీమణితో కలసి ఇటలీలో రీఛార్జ్ అవుతున్న ఫోటోస్ వైరల్‌గా మారాయి. మెగాస్టార్ బాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లీక్ ఇచ్చేశారు. వెంకటేశ్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా పడగా.. రీ-రికార్డింగ్ అప్‌డేట్‌లో పొరపాటున అక్టోబర్ 30 అంటూ రిలీజ్ డేట్ పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశారు. ఆ తర్వాత సవరించినా.. దీపావళికి వెంకీ మామ వచ్చేస్తున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
మాల్దీవ్స్ వెకేషన్‌లో నయనతార దిగిన బ్లర్ బికినీ ఫోటోలను నెటిజన్లు ఏఐతో రీ-ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. 40 ప్లస్ లోనూ నయన్ మెయింటైన్ చేస్తున్న ఫిట్‌నెస్ చూసి షాక్ అవుతున్నారు. ప్రెజెంట్ సౌత్, నార్త్ సినిమాలతో బిజీగా ఉన్న లేడీ సూపర్‌స్టార్ ఈ హాట్ పిక్స్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ నిజమైన పాన్ ఇండియా సినిమా అని దర్శకుడు విశాల్ చతుర్వేది తెలిపారు. అక్టోబర్ 9న తెలుగులో రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం.. నేటి కాలంలో పిల్లలకు ఇలాంటి దైవిక సినిమాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్షన్ల కంటే ప్రతీ ఒక్కరినీ అలరించడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
నమ్మలేకపోతున్నాం.. నానా పటేకర్ మృతిపై సెలబ్రిటీలు
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’.. తమిళ సినిమాగా ప్రచారం అందుకేనా?
తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి