ప్రపంచ సినిమా సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’
ABN, Publish Date - Jun 23 , 2026 | 12:32 PM
ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి.
భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ముగించుకున్న మెగాస్టార్ చిరంజీవి, బాబీ చిత్రం ‘మెగా158’.. ఇప్పుడు తదుపరి ఘట్టానికి సిద్ధమైంది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల కాంబో మూవీ ‘హను-మాన్’ ఈ నెల 25న 3D వెర్షన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నయా రికార్డు సృష్టించారు. ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్ళు సాధించడంతో.. రణవీర్ సింగ్ లాభాల వాటా రూపంలో ఏకంగా రూ. 325 కోట్లు తీసుకుని ఇండియాలోనే ఒకే సినిమాకు అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు అవమానం జరిగింది. ముంబై యోగా వేడుకల్లో అమృతా ఫడ్నవీస్.. హీరోయిన్ శ్రీలీలను చేతి సైగతో పక్కకు పొమ్మని చెప్పిన వీడియోపై వివాదం రాజుకుంది. హర్షిత్ రెడ్డి, వాసుదేవ్ కొప్పినేని కాంబోలో వచ్చిన ‘దీవానా’ విజయవంతంగా దూసుకుపోతోంది.. ఇలాంటి మరిన్ని సినిమా విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం తిలకించండి.
ఇవి కూడా చదవండి:
సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక