సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:32 AM
కొన్ని రోజులుగా సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే సమంత కానీ, రాజ్ కానీ.. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు. తాజాగా ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ ద్వారా రివీల్ చేశారు.
కొన్ని రోజులుగా సమంత (Samantha) ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే సమంత కానీ, రాజ్ కానీ.. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు. ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సక్సెస్ సందర్భంగా అభినందించేందుకు వచ్చిన మీడియా వారితో సమంత కనిపించిన విధానంతో ఈ వార్తపై ఓ క్లారిటీ వచ్చేసింది. సమంత బేబీ బంప్‌తో కనిపించి.. అందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. పనిలో పనిగా సమంత గర్భవతి అనే విషయాన్ని లీక్ చేసేశారు.
‘‘ ‘మా ఇంటి బంగారం’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్.. ఇంకా మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సినిమాకు సంబంధించి టీమ్ అందరినీ ప్రశంసించిన చిరంజీవి.. చివరిలో ‘అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అని తెలపడంతో.. మరోసారి ఆయన పద్ధతిలో విషయాన్ని లీక్ చేసేశారు. ఈ విషయం తెలిసి సమంత ఎలా రియాక్ట్ అయి ఉంటుందో తెలియదు కానీ, చిరు లీక్స్ ద్వారా సమంత ప్రెగ్నెంట్ అనే విషయం అయితే రివీలైంది. సమంత, రాజ్ దంపతులు కూడా ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వంటి లెజెండ్ రివీల్ చేయడాన్ని హ్యాపీగా తీసుకుని ఉండవచ్చు. ఏదైతేనేం.. చాలా రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు మాత్రం చిరు తెరదించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుండటమే కాకుండా.. మెగాస్టార్‌కు సమంత ఫ్యాన్స్ నుంచి ‘థ్యాంక్యూ’ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!