ప్రపంచ సినిమా సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’
ABN, Publish Date - Jun 28 , 2026 | 03:02 PM
ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి.
‘మా ఇంటి బంగారం’ భారీ విజయంతో విశాఖపట్నంలో నిర్వహించిన సక్సెస్ మీట్ అభిమానుల కోలాహలంతో అట్టహాసంగా జరిగింది. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటిస్తోన్న ‘గుర్తుకొస్తున్నాయి’ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. అల్లు అర్జున్ ఆప్తమిత్రుడు సందీప్ రామినేని నిర్మిస్తున్న ‘జోకర్’ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అల్లు స్నేహా రెడ్డి స్విచ్చాన్ చేశారు. దినేశ్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న ‘హే చికీతా’ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి స్పెషల్‌గా విడుదల అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తోన్న ‘రాజా ది రాజా’ చిత్రం నుంచి ‘ఊహలే’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. ఇక పట్టుకోలేరేమో
స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా..?
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!