Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 24 , 2026 | 12:32 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
మాహిష్మతి సామ్రాజ్యం వెనుక ఉన్న శ్రమ, రాజమౌళి విజన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూసేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 26 నుంచి ‘ద టార్చ్ బేరర్’ డాక్యుసిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ‘మా ఇంటి బంగారం’ మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు చిత్రబృందాన్ని సత్కరించారు. అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కనున్న AA23 మూవీ లుక్ టెస్ట్ కోసం జూన్ 25న చిత్ర బృందం ముంబై వెళ్ళనుంది. ముంబైలో నాని కొత్త సినిమా ‘బ్లడీ రోమియో’ టెస్ట్ షూట్ పూర్తయింది. డైరెక్టర్ సుజీత్ చేసిన ఈ స్టంట్స్ నానికి బాగా నచ్చాయి. లండన్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ దూకుడు పెంచింది. ఇటీవల ‘సింగ్ గీతం’లో నటించిన ఈ బ్యూటీ ‘మెగా 158’లో మెరవనున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ పొతినేని సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది.. ఇలాంటి మరెన్నో సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండి.
ఇవి కూడా చదవండి:
పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!