Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Sep 03 , 2026 | 03:29 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ ‘ఇరుముడి’ 11 రోజుల్లోనే 200 కోట్ల కలెక్షన్లు సాధించడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పులిపై బేబి నక్షత్ర అయ్యప్పస్వామిలా దర్శనమివ్వగా, పక్కనే రవితేజ, ప్రియాభవానీ శంకర్ ఉన్నారు. మరోవైపు ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండ ‘మైసా’ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘వైలెంట్ పిల్లా’ అంటూ రశ్మికను సరదాగా అభినందించారు. ‘మైసా’ సినిమాతో అభిమానులు గర్వపడేలా చేస్తావు అని కొనియాడారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చివరి దశకు చేరుకోగా.. మరో 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘దేవరాయ’ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో బర్త్ డే ట్రీట్ అందించారు మేకర్స్. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ కనిపించనున్న ఈ చారిత్రాత్మక చిత్రం 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న ‘రోమాంచకం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా సుమంత్ చొక్కాపై ఆటోగ్రాఫ్ చేసిన ప్రభాస్.. ఈ చిత్రం పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని ఆకాంక్షించారు. ఇక ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యులు యుబైఎ సర్టిఫికెట్ జారీ చేశారు.. ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి:

Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్‌

Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా.. ‘రోమాంచకం’ మూవీ రివ్యూ

యశ్‌ని ‘రామాయణ’ ఏం చేస్తుందో..

Updated at - Sep 03 , 2026 | 03:29 PM