సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Sep 24 , 2026 | 05:17 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

48 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవిని ‘కాకా’ సెట్స్‌లో కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించింది చిత్రబృందం. దర్శకుడు బాబీ, కెవీయన్ ప్రొడక్షన్స్‌తో పాటు టీమ్ చూపించిన ప్రేమాభిమానాలకు చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ సినిమాలో మహేశ్ బాబుకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయిందట. మిగిలిన సన్నివేశాల చిత్రీకరణతో బిజీగా ఉన్న జక్కన్న.. అక్టోబర్ మొదటి వారంలో మొత్తం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారట.

రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న ‘రాపో 23’ రెండో షెడ్యూల్ పూర్తయింది. ఒక కిలోమీటర్ పొడవైన సెట్‌లో నైట్ ఫైట్ సీన్‌ను చిత్రీకరించారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెవిన్‌ ఈ సీక్వెన్స్‌ని డిజైన్‌ చేశారట. ‘రణబాలి’ షూటింగ్, డబ్బింగ్ పనులను పూర్తి చేసిన విజయ్ దేవరకొండ.. ‘రౌడీ జనార్దన’ కొత్త షెడ్యూల్ కోసం మంగళూరు వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతోన్న భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో జాయినట్లు టాక్.. ఇంకా ఇలాంటి మస్త్ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

Updated Date - Sep 24 , 2026 | 05:24 PM