Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక
ABN, Publish Date - Sep 18 , 2026 | 04:43 PM
వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.
డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ‘కాకా’ చిత్రంలో చిరంజీవి భార్యగా స్నేహ నటించనున్నారట. కూతురుగా అనశ్వర రాజన్, కీలకపాత్రలో నివేదా పేతురాజ్ కనిపిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబో ‘రాకా’ నుంచి ‘37’ నంబర్‌తో వచ్చిన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. అసలు ఈ 37 ఏంటనే విషయాన్ని మేకర్స్ సీక్రెట్‌గా ఉంచడంతో.. అభిమానుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అయితే అట్లీ బర్త్‌డే సెప్టెంబర్ 21 కాబట్టి ఆ రోజున బిగ్ అప్‌డేట్ వస్తుందని టాక్. సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తోంది. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రశ్మిక మందన్న నటిస్తుండగా.. కమల్ హాసన్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. అమ్మే తమతో ఈ సినిమా తీయిస్తూ రశ్మికను ఎంచుకున్నారని మేకర్స్ తెలిపారు. ఈ బయోపిక్‌లో ఎం.ఎస్. ఎదుర్కొన్న సవాళ్ళు, జీవిత ప్రయాణాన్ని చూపించనున్నారట.. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక.
ఇవి కూడా చదవండి:
ఈ పాట కోరిన వారు... మూవీ రివ్యూ
పవన్ కళ్యాణ్‌తో ఒకే ఒక్క ఛాన్స్.. : నటి కావ్యశ్రీ
క్రికెట్‌లో లెజెండే.. పడకగదిలో ఆకట్టుకోలేదు: రోహిత్ శర్మపై నటి షాకింగ్ కామెంట్స్