క్రికెట్‌లో లెజెండే.. పడకగదిలో ఆకట్టుకోలేదు: రోహిత్ శర్మపై నటి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 17 , 2026 | 08:35 PM
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మతో గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘బిగ్ బాస్’ ఫేమ్, ప్రముఖ మోడల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పడకగదిలో రోహిత్ వీక్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘బిగ్ బాస్’ ఫేమ్, ప్రముఖ మోడల్ సోఫియా హయత్ (Sofia Hayat) చేసిన ఘాటైన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 2012 సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగినప్పటికీ.. రోహిత్ శర్మ ఈ వ్యవహారంపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోఫియా.. నాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘‘ఆ సమయంలో నాకు క్రికెట్ గురించి ఏమీ తెలియదు, నా మేనేజర్ ద్వారానే ఆ రంగానికి కనెక్ట్ అయ్యాను. ఆ రోజుల్లోనే భారత జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మతో డేటింగ్ చేశాను. ప్రస్తుతం ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరు. అయితే మైదానంలో ఎంత గొప్ప ఆటగాడైనప్పటికీ, పడకగదిలో మాత్రం నన్ను మెప్పించలేకపోయాడు (He was not good in bed). అతను బ్యాటింగ్‌లో రాణించినంతగా ప్రైవేట్ లైఫ్‌లో ఆకట్టుకోలేకపోయాడు’’ అంటూ పచ్చిగా కామెంట్స్ చేశారు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత పలు విభేదాల కారణంగా తాము విడిపోయినట్లు వెల్లడించారు.
అంతటితో ఆగకుండా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘నేనే రోహిత్ జీవితంలో తొలి మహిళను. ప్రైవేట్ జీవితంలో మహిళల మనోభావాలను ఎలా గౌరవించాలో పురుషులకు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. చాలామంది పురుషులు భాగస్వామి ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా, కేవలం నిమిషాల్లో ముగించేస్తే సరిపోతుందని భావిస్తారు. మహిళకు తగిన విలువ, గౌరవం, నమ్మకం ఇచ్చినప్పుడే ఆ బంధానికి నిజమైన అర్థం ఉంటుంది’’ అంటూ వ్యక్తిగత సంబంధాలపై ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతూ, తన కుటుంబంతో హ్యాపీగా సాగుతున్నారు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ దశాబ్దానికి పైగా గడిచిన పాత వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం తన పాడ్‌కాస్ట్ పబ్లిసిటీ కోసమే రోహిత్ పేరును వాడుకుంటూ సోఫియా దిగజారి మాట్లాడుతోందంటూ నెట్టింట ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
నేనెప్పుడు చెప్పాను.. సినిమాలకు గుడ్‌బై వార్తలపై అను స్పందనిదే
‘వారణాసి’ నుంచి క్రేజీ అప్‌డేట్.. జక్కన్న మాస్టర్ ప్లాన్ అదేనా?
పల్లవి జోషికి సి.బి.ఎఫ్.సి.లో చోటు... విమర్శకులపై విరుచుకుపడ్డ వివేక్ అగ్నిహోత్రి