Rapid Chitram: గేమింగ్ రంగంలోకి మహేశ్.. ‘పాకెట్ రాకెట్స్’ టీజర్.. ఇంకా మరెన్నో అప్‌డేట్స్

ABN, Publish Date - Nov 04 , 2026 | 02:38 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ సరికొత్త అడుగులు వేస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా గేమింగ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ముంబైకి చెందిన ‘షార్ట్ గన్ గేమ్స్’ సంస్థలో ఆయన వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా చేరారు. ఇందులో భాగంగా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘పాకెట్ రాకెట్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో రుద్ర అత్రి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా.. శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తోంది.

నవంబర్ 19న రాబోతున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ట్రైలర్ విడుదలైంది. ఫస్ట్ పార్ట్‌లానే ఫ్రెండ్‌షిప్, ఫన్, అల్లరితో కూడిన మరో క్రేజీ ప్రయాణాన్ని ఇందులో చూపించబోతున్నారు. తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు శివాత్మిక రాజశేఖర్, అనిషా ఆంబ్రోస్ నటిస్తున్నారు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి ప్రతిష్ఠాత్మక ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం’ దక్కింది. హైదరాబాద్‌ శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు తదితరులు ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. సిరివెన్నెలకు రామజోగయ్య శాస్త్రి నిజమైన వారసుడని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు.

ఇవి కూడా చదవండి:

సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

Updated at - Nov 04 , 2026 | 02:39 PM