Tollywood: అందరి దృష్టి 'సింగ్‌ గీతం' పైనే!

ABN , Publish Date - Jun 11 , 2026 | 02:56 PM

లాస్ట్ వీక్ థియేటర్లలో సందడి అంతా 'పెద్ది' దే. దానితో పాటే రిలీజైన డబ్బింగ్‌ మూవీ 'హీ మ్యాన్‌ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్' పెద్దంతగా ఎవరికీ ఎక్కలేదు. అయితే ఈ వీకెండ్‌ మాత్రం పలు రీ-రిలీజ్‌లతో పాటు ఆరు భిన్నమైన కథా చిత్రాలు జనాలను అలరించడానికి వస్తున్నాయి.

This weekend Movies

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) పుట్టిన రోజు జూన్ 10. ఈ సందర్భంగా ఆయన నటించిన బ్లాక్‌ బస్టర్ మూవీస్‌ 'సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు'ను ఎంపిక చేసిన కొన్ని కేంద్రాలలో తిరిగి విడుదల చేశారు. జై బాలయ్య (Jai Balayya) అంటూ ఈ సినిమాలు ప్రదర్శితమయ్యే థియేటర్లు బుధవారం దద్దరిల్లాయి. అలానే శుక్రవారం గోపీచంద్‌ (Gopichand) పుట్టినరోజు సందర్భంగా 'గోలీమార్‌' సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఇక శనివారం ప్రభాస్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'ఈశ్వర్‌' (Eswar) ను రీ-రిలీజ్‌కు సిద్థం చేశారు.

'సింగ్‌ గీతం' కోసం ఎదురుచూపు!

తెలుగు సినిమా పుట్టడానికి యేడాది ముందు జన్మించిన వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు (Singeetham Sreenivasarao). సో... ఆయన వయసు తెలుగు సినిమా వయసూ దాదాపు ఒక్కటే. 94వ వసంతాన్ని త్వరలోనే పూర్తి చేసుకోబోతున్న దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరెకెక్కించిన సినిమా 'సింగ్‌ గీతం' (Sing Geetham). గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమాను ఒక రోజు ఆలస్యంగా జనం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఆన్‌ లైన్ బుకింగ్‌ మొదలు కాగానే తొలి టిక్కెట్‌ రాజమౌళి కొనుగోలు చేయగా, ఈ సినిమాను తాను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కోసం చూస్తానని త్రివిక్రమ్ చెప్పారు. మాటలను పాటలు ఆలపించే ఓ గ్రామం కథ ఇది. నూతన నటీనటుతో సింగీతం దర్శకత్వంలో నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) స్వరరచన చేశారు.


రెండేళ్ళ క్రితం ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ గోపరాజు 'సర్కారు నౌకరి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దంతగా ఆడలేదు. దాంతో ఇప్పుడు 'కొత్త మలుపు' సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాతో భైరవి అర్ధ్యా హీరోయిన్‌గా, శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువ దర్శకుడు సంజీవ్‌ మేగోటి తెరకెక్కించిన 'పోలీస్‌ కంప్లైంట్‌'లో వరలక్ష్మీ శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ కు వరలక్ష్మీ, నవీన్ చంద్ర దూరంగా ఉండటంపై చిత్ర బృందం కినుక వహించింది. ఇదే శుక్రవారం దుర్గాదేవ్ నాయుడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'ఐ యామ్‌ హ్యాండ్సమ్‌', 'డేంజర్‌ డెవిల్‌', విక్రమ్‌ భట్‌ హిందీ అనువాద త్రీ డీ సినిమా 'హాంటెడ్‌' కూడా విడుదల అవుతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు వేటిని ఆదరిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!

బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..

Ravi Mohan: భార్య‌కు నెల‌కు రూ.40 ల‌క్ష‌ల భ‌ర‌ణం.. హీరో ర‌వి మోహ‌న్‌కు కోర్టులో చుక్కెదురు

Updated Date - Jun 11 , 2026 | 03:05 PM