సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

ABN, Publish Date - Jun 14 , 2026 | 08:49 PM

హీరో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యానని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై.. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ చిత్ర వేడుకకు వినాయక్ అతిథిగా హాజరయ్యారు.

VV Vinayak About Vadde Naveen

హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) పరపతి చూసి షాకయ్యానని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ (VV Vinayak). వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై.. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu). కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్న ఈ చిత్రంలో రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 19న విడుదల సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్ మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు.


అనంతరం వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ‘‘వడ్డే నవీన్ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను ఆయన చిత్రానికి అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేస్తున్న టైమ్‌లోనే ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆయన సినిమాకే స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు అక్కడ ఎన్టీఆర్‌తో పరిచయమైంది. ‘ఆది’ సినిమాకు నాంది వడ్డే నవీన్ సినిమా. ఆయన నన్ను ఎంతో ఇష్టంగా చూసుకునేవారు. ఆయన కెరీర్‌లోని 90 శాతం సినిమాలు మనస్పూర్తిగా, ఇష్టంతో చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. ఒకసారి నేనో సీన్ రాస్తే.. ఆ సీన్ ఆయనకు నచ్చి నన్ను భోజనానికి పిలిచారు. వినయ్, నువ్వు చాలా మంచి డైరెక్టర్‌వి అవుతావు.. ఇక అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయడం మానేయ్.. ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటానని అన్నారు. ఎందుకో నేనంటే ఆయనకు అంత ఇష్టం.


ఓ సందర్భంలో ఆయన పరపతి చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే, ఒకసారి మేము స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే ఒక కాస్ట్యూమర్.. ఫ్లైట్‌ టాయిలెట్‌లో సిగరెట్ కాల్చాడు. మేము ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి ఏకే-47 గన్స్‌తో పోలీసులు వచ్చేసి.. ఆ కాస్ట్యూమర్‌ని అరెస్ట్ చేశారు. చెన్నైలో ఎవరికీ ఏం తెలీదు. అప్పుడు వడ్డే నవీన్ ఎవరితోనో జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.. వెంటనే ఆ కాస్ట్యూమర్‌ బయటకి వచ్చేశాడు. అబ్బో.. ఇంత ఇన్ఫ్లుయెన్స్‌డ్ పర్సనా ఇయనా? అని నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆయన వెళ్లాల్సిన స్థాయికి వెళ్లారని నేను అనుకోను. కానీ, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇక్కడి నుంచి అయినా ఆయనకి నచ్చిన సినిమాలు, మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలి. అప్పుడు సినిమాలు మానేసిన తర్వాత మళ్లీ ఇప్పడే ఆయన వాయిస్‌ని ఫోన్‌లో విన్నాను. ఆయనని చూడడం కూడా ఇదే. అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆయనని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!

సినీ నటి గౌతమి సంచలన నిర్ణయం

బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్

Updated Date - Jun 14 , 2026 | 08:49 PM