సినీ నటి గౌతమి సంచలన నిర్ణయం

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:29 PM

సీనియర్ నటి గౌతమి తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. రీసెంట్‌గా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Gautami Tadimalla

సీనియర్ నటి గౌతమి (Gautami Tadimalla) తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. రీసెంట్‌గా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న గౌతమి.. ప్రస్తుతం మంచి పాత్ర అనిపిస్తే మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించడానికి వెనుకాడటం లేదు. ఇక సినిమాల సంగతి ఇలా ఉంటే.. రాజకీయాల్లోనూ ఆమె మంచి గుర్తింపును పొందారు. ఈ నేపథ్యంలో రాజకీయాల పరంగా ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


ఆమె నిర్ణయంతో తమిళనాడు ‘ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)’ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గౌతమి.. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పదవికీ రిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామికి తన రాజీనామా లేఖను పంపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్న ఆమె.. భవిష్యత్తులో ప్రజాసేవ పట్ల నిబద్ధతను కొనసాగిస్తానన్నారు. అయితే.. రాజీనామాకు దారితీసిన కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.


నటి గౌతమి రాజకీయ ఎంట్రీ బీజేపీతో మొదలైంది. ఆ పార్టీలో బీజేవైఎమ్ ఉపాధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి, పార్టీ తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. అలాంటి సమయంలో ఆమె ఆకస్మిక రాజీనామా తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. గౌతమి నిర్ణయంపై పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఆమె మరో రాజకీయ పార్టీలో ఏమైనా చేరబోతున్నారా? లేక స్వతంత్రంగా ప్రజాసేవ కొనసాగిస్తారా? అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్

దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!

‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?

Updated Date - Jun 14 , 2026 | 05:29 PM