సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చైతూ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘ఫౌజీ’ వాయిదా పడినట్టే!

ABN, Publish Date - Sep 10 , 2026 | 08:29 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మిస్టీరియస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Vrushakarma Release Date

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మిస్టీరియస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపినీడు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, అడ్వెంచర్ అంశాల మేళవింపుతో ఇప్పటివరకు భారతీయ తెరపై ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని భారీ స్కేల్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, స్ట్రైకింగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.


ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా లాక్ చేస్తూ అల్ట్రా స్టైలిష్ పోస్టర్‌ను వదిలారు. ఈ మైథికల్ స్పెక్టాకిల్ 4 డిసెంబర్, 2026న (Vrushakarma Release Date) గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ విడుదల తేదీ వెనుక టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నిజానికి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో (డిసెంబర్ 3న) విడుదల చేయాలని భావించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడం, భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ‘ఫౌజీ’ ఆ డేట్ నుంచి తప్పుకుని వాయిదా పడినట్లు ఫిలింనగర్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ క్రేజీ డేట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇతర హీరోలు లైన్‌లోకి వస్తుండగా.. ముందుగా నాగచైతన్య తన సినిమాను సరిగ్గా డిసెంబర్ 4న దించుతూ పోస్టర్ రిలీజ్ చేయడంతో ‘ఫౌజీ’ వాయిదా ఖరారైనట్లేనని ఇండస్ట్రీ వర్గాలు ఒక అంచనాకు వచ్చేస్తున్నాయి.


‘వృషకర్మ’ కోసం విడుదల చేసిన తాజా పోస్టర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. షార్ప్ కట్ హెయిర్‌స్టైల్, గుబురు గడ్డం, వీపున బ్యాగ్‌తో పాటు చేతిలో పవిత్రమైన వింత ఆయుధాన్ని ధరించి చైతూ కనిపిస్తున్న తీరు ఇంటెన్స్‌గా ఉంది. ఈ సినిమా కోసం నాగచైతన్య పూర్తి సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం, రాగుల్ డి. హెరియన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ కోసం కావాల్సినంత సమయం దొరకడంతో, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో.. డిసెంబర్ బరిలో చైతూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

రెమ్యూనరేషనే లేదన్నారు కదరా.. ‘ఇరుముడి’తో రవితేజ భారీ జాక్‌పాట్

‘అ’ బ్లడీ హంగర్‌ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే

‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్

Updated Date - Sep 10 , 2026 | 08:29 PM