సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తుది దశకు చేరుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. టార్గెట్ డిసెంబర్

ABN, Publish Date - Aug 27 , 2026 | 05:40 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా.. దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ అప్‌డేట్ వచ్చేసింది.

Legacy Movie Update

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) హీరోగా.. దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ (Legacy). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రాన్ని అందించిన కలాహీ మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వగా.. తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే షూటింగ్ అప్‌డేట్‌ను పంచుకుంది.


ప్రస్తుతం ‘లెగసీ’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నేటి (ఆగస్ట్ 27) నుంచి నెల రోజుల పాటు సాగే భారీ, కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించారు. ప్రధాన తారాగణమంతా పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కథకు ఎంతో ముఖ్యమైన కీలక సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్ బ్లాక్స్, పాటలను చిత్రీకరించనున్నారు. పవర్‌ఫుల్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ డ్రామా, అదిరిపోయే సంగీతం, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సినిమా సిద్ధమవుతోంది. ఆ వారసత్వాన్ని మోయడమా లేక తిరగరాయడమా అనే బలమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


అధికారం, కుటుంబ విలువలు, ప్రేమ, ద్రోహం చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు కే కే మీనన్ అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో మెప్పించనున్నారు. వీరితో పాటు మురళీ మోహన్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో ‘లెగసీ’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

డైరెక్టర్ పవన్‌ సాధినేని కేసులో ట్విస్ట్.. పలువురు మహిళలతో!

మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి.. ‘ఇరుముడి’పై చిరు పోస్ట్ వైరల్

GV Narayanarao: నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. 

Updated Date - Aug 27 , 2026 | 05:53 PM