డైరెక్టర్ పవన్‌ సాధినేని కేసులో ట్విస్ట్.. పలువురు మహిళలతో!

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:27 PM

టాలీవుడ్ దర్శకుడు పవన్ కుమార్ సాధినేని పై నమోదైన వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నట్లుగా బాధితురాలు ఆరోపించింది.

Pavan Kumar Sadineni

టాలీవుడ్ దర్శకుడు పవన్ కుమార్ సాధినేని (Pavan Kumar Sadineni)పై నమోదైన వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గోల్కొండ పరిధిలోని షేక్‌పేట్ జైహింద్ నగర్ కాలనీకి చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. గత 20 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతూ, 2023 నుంచి పూర్తిగా మంచానికే పరిమితమైన ఆ యువతిని కుటుంబ సభ్యులు వదిలేయడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమెతో పరిచయం పెంచుకున్న పవన్ సాధినేని.. ఆమెతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు.


బాధితురాలికి ఆర్థిక సహాయం చేయడం, ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్య బిల్లులు చెల్లించడం వంటివి చేస్తూ ఆమెకు నమ్మకం కలిగించాడు. ఆమె ఆరోగ్యం, భవిష్యత్ కెరీర్, ఆర్థిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని నమ్మబలికాడు. అయితే, పవన్‌కు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారనే చేదు నిజాన్ని బాధితురాలు తెలుసుకుని నిలదీయగా.. తాను భార్యకు విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నానని, అది ముగియగానే నిన్నే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత బాధితురాలిని క్రమంగా దూరం పెడుతూ, కేవలం శారీరక అవసరాల కోసం నెలకు ఒకసారి వచ్చి వెళ్లేలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్రాజెక్టుల్లో నటిగా అవకాశాలు ఇస్తానని మోసం చేయడమే కాకుండా, విచారించగా ఆయనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, వారందరికీ ఇలాంటి హామీలే ఇస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.


ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటికి వచ్చిన పవన్ సాధినేని.. శారీరకంగా కలవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆ సమయంలో అసాధారణమైన లైంగిక చర్యలకు పాల్పడి ఆమెను తీవ్రంగా హింసించినట్లు బాధితురాలు గోల్కొండ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ (BNS) 69, 115(2) సెక్షన్ల కింద క్రైమ్ నం. 305/2026తో కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాలతో డైరెక్టర్ పవన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పవన్ సాధినేని ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. దర్శకుడి అరెస్ట్‌తో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి.. ‘ఇరుముడి’పై చిరు పోస్ట్ వైరల్

GV Narayanarao: నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. 

Toxic: అయ్యో.. రుక్మిణి వసంత్‌ని అలా వాడేశారేంట్రా

Updated Date - Aug 27 , 2026 | 03:27 PM