LEGACY: రూట్ మార్చిన విశ్వక్.. ఈ సారి గట్టిగానే ఫ్లాన్ చేశాడుగా
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:54 PM
విశ్వక్ సేన్ (VISHWAK SEN) కథానాయకుడిగా తాజాగా ఓ పోలిటికల్ థ్రిల్లర్ చిత్రం లెగసీ (LEGACY) పట్టాలెక్కింది.
విశ్వక్ సేన్ (VISHWAK SEN) కథానాయకుడిగా తాజాగా ఓ పోలిటికల్ థ్రిల్లర్ చిత్రం లెగసీ (LEGACY) పట్టాలెక్కింది. రెండేండ్ల క్రితం పిండం అనే సినిమాతో ఆకట్టుకున్న సాయి కిరణ్ రెడ్డి దైద (SAIKIRAN REDDY DAIDA) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ గ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ నటుడు కేకే మీనన్ (KAY KAY MENON), రావు రమేశ్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96, ఫేమ్ గోవింద్ వసంత (GOVIND VASANTHA )సంగీతం అందిస్తున్నాడు
రీసెంట్‌గా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ టీజర్ చూస్తే.. విశ్వక్ తన పంథాను పూర్తిగా మార్చుకుని మరోమారు ప్రయోగం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఎంట్రీ ఇస్తూ చెప్పిన డైలాగులు. తండ్రి స్థూపంపై మూత్రం పోయడం వంటి సన్నివేశాలు అన్ని చూస్తుంటే మేకర్స్ ఏదో గట్టిగానే ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.