సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విశాల్ ‘మకుటం’ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్.. ఎప్పుడంటే

ABN, Publish Date - Aug 05 , 2026 | 11:34 PM

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ 99వ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మకుటం’. హీరో విశాల్ హీరోగా, దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం ఆర్ బీ చౌదరి నిర్మాణంలో తెరకెక్కుతోంది.

Makutam Movie Still

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ 99వ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మకుటం’ (Makutam). హీరో విశాల్ (Vishal) హీరోగా, దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం ఆర్ బీ చౌదరి నిర్మాణంలో తెరకెక్కుతోంది. విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘మకుటం’ ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు, సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఈ సినిమాను ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటంతో పాటు, దర్శకుడిగా చేస్తున్న మొదటి సినిమా కావడం, ఇంకా జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. సినిమాకు సంబంధించి విడుదలవుతోన్న ప్రతీ అప్డేట్ సినిమాపై మరింతగా క్రేజ్‌ని పెంచేస్తోంది.


ఇప్పుడిక సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో టీమ్ మరింత స్పీడ్ పెంచే క్రమంలో ఉంది. జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, N.B. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. ఈ సినిమాతో దర్శకుడిగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాలంటే.. ఆగస్ట్ 14 వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

చిన్న పట్టణాలకూ పీవీఆర్ ఐనాక్స్.. ఇక సింగిల్ స్క్రీన్ల కాలం చెల్లినట్టేనా

మేఘన మిస్సింగ్.. డైరెక్టర్ వి.వి.వినాయక్ ఏం చేశారంటే

మహేష్ బాబు బర్త్‌డే‌కి రాజమౌళి ఇచ్చే ట్రీట్ ఏంటి? ఇప్పుడిదే ట్రెండింగ్

Updated Date - Aug 05 , 2026 | 11:34 PM