మేఘన మిస్సింగ్.. డైరెక్టర్ వి.వి.వినాయక్ ఏం చేశారంటే
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:42 PM
‘మిస్సింగ్ మేఘన’కు సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ తన సపోర్ట్ అందించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రమిది.
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’ (Missing Meghana). ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకుడు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు వంటి ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ (VV Vinayak) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ విడుదల అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ సపోర్ట్‌తో వాచస్పతి దర్శకుడిగా వస్తోన్న సినిమా ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమాతో హీరో రామ్ కార్తీక్, దర్శకుడు వాచస్పతిలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్. తనే పాటలు రాస్తాడు, తనే మ్యూజిక్ చేస్తాడు.. అతడికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాతో ఈ టీమ్ మొత్తానికి సక్సెస్ రావాలని, ప్రేక్షకులు ‘మిస్సింగ్ మేఘన’ను ఆదరించాలని కోరుకుంటూ.. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. వి.వి. వినాయక్‌ది గోల్డెన్ హ్యాండ్. ఆయన మా సినిమా టైటిల్ రివీలింగ్ పోస్టర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మీడియాతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు మీడియా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురానున్నామని తెలిపారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. వినాయక్‌కు, సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఒక మంచి మ్యూజిషియన్‌కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
మహేష్ బాబు బర్త్‌డేకి రాజమౌళి ఇచ్చే ట్రీట్ ఏంటి? ఇప్పుడిదే ట్రెండింగ్
ప్రీతి జింటాతో డేటింగ్.. క్రికెటర్ బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
ప్రదీప్ రావత్ మృతి.. టాలీవుడ్‌లో స్పందనేది