మహేష్ బాబు బర్త్‌డేకి రాజమౌళి ఇచ్చే ట్రీట్ ఏంటి? ఇప్పుడిదే ట్రెండింగ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:35 PM
సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు వస్తోందంటే చాలు.. ఆయన అభిమానుల్లో ఉండే ఆనందమే వేరు. మహేష్ నటిస్తున్న సినిమాకు సంబంధించి చిన్న గ్లింప్స్ లేదా టీజర్ రూపంలో ఏదో ఒక స్పెషల్ ట్రీట్ వస్తుందని ఫ్యాన్స్ ఎప్పుడూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Mahesh Babu) పుట్టినరోజు వస్తోందంటే చాలు.. ఆయన అభిమానుల్లో ఉండే ఆనందమే వేరు. మహేష్ నటిస్తున్న సినిమాకు సంబంధించి చిన్న గ్లింప్స్ లేదా టీజర్ రూపంలో ఏదో ఒక స్పెషల్ ట్రీట్ వస్తుందని ఫ్యాన్స్ ఎప్పుడూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న ఒక ట్రెండ్. అయితే, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) పట్టాలెక్కినప్పటి నుంచి ఈ బర్త్‌డే ట్రీట్‌ల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. సాధారణ సినిమాలలాగా ప్రమోషన్స్ ఉండవని, జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీనే వేరుగా ఉంటుందని అప్పట్లోనే ఓ క్లారిటీ వచ్చింది.
గతంలో ‘గుంటూరు కారం’ సినిమా విడుదలైన తర్వాత మహేష్ తన కొత్త లుక్ కోసం, అలాగే సరికొత్త మేకోవర్ కోసం చాలా సమయం కేటాయించాల్సి వచ్చింది. ఆ ఏడాది జక్కన్న సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. సరే, పోనీ గతేడాది పుట్టినరోజుకైనా గ్లింప్స్ ఇస్తాడనుకుంటే.. ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ మహేష్ ముఖం పూర్తిగా కనిపించని ఒక సింపుల్ పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తరువాత నవంబర్‌లో ప్రీ గ్లింప్స్ రావడంతో ఆ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ పడి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ, ఇప్పడు అసలు సమస్య వేరే ఉంది. ఈ ఏడాది ఆగస్టు 9న రాబోయే మహేష్ పుట్టినరోజున కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే రిపీట్ కాబోతుందనే టాక్ సినిమా సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈసారి కూడా ఫ్యాన్స్‌కు జక్కన్న పెద్ద ట్విస్టే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఆగస్టు 9న (Mahesh Birthday Date) వారణాసి సినిమా నుంచి కేవలం మహేష్‌కు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందట. గ్లింప్స్ లేదా టీజర్ ఆశించేవారికి ఇది నిజంగా నిరాశ కలిగించే విషయమే.
అయితే దీని వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి టీమ్ ఎక్కడ చూసినా డే అండ్ నైట్ షూటింగ్ పనులతోనే బిజీగా ఉంది. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, ఎడిటింగ్ విభాగాలు, అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్ పనులపై యూనిట్ పూర్తి దృష్టి పెట్టింది. గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్న ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మలుస్తున్నారు. ఇలాంటి అత్యంత బిజీ షెడ్యూల్, ఒత్తిడిలో ఉన్న సమయంలో.. మహేష్ బర్త్‌డే కోసం ప్రత్యేకంగా ఒక గ్లింప్స్‌ను కట్ చేసి వదలడం అనేది కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ హడావుడి తారాస్థాయిలో ఉంది. మహేష్‌కు సంబంధించిన ఒక్క చిన్న గ్లింప్స్ అయినా వదలాలని, తమ ఆకలి తీర్చాలని నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.
సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండటంతో అభిమానుల ఆతృత కూడా అదే స్థాయిలో ఉంది. కాని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన అసలైన మెయిన్ అప్‌డేట్స్, మేజర్ ప్రమోషనల్ కంటెంట్ అన్నీ కూడా ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదే ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత గోప్యత పాటిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు ప్రేక్షకులకు ఒక అంతుచిక్కని రహస్యంగా ఉంచాలనేది ఆయన ప్లాన్. మరి ఈసారైనా రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ మొర వింటాడో లేదో, లేక మరోసారి పోస్టర్‌తోనే సరిపెడతాడో వేచి చూడాల్సిందే..!
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటాతో డేటింగ్.. క్రికెటర్ బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
ప్రదీప్ రావత్ మృతి.. టాలీవుడ్‌లో స్పందనేది
తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన