Vijay Deverakonda: రౌడీ స్టార్.. లైనప్ అదిరింది..
ABN, Publish Date - Jun 14 , 2026 | 10:20 PM
రణబాలి, రౌడీ జనార్దన చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తన స్టార్ డమ్‌ను నిలబెట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి దేశవ్యాప్తంగా నిరూపించుకోవడానికి ఇప్పుడు పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతున్నాడు. విజయ్ లైనప్‌లో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టులు చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా వరుస షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
ఒకవైపు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రణబాలి (Ranabali) సినిమా కోసం రక్తం చిందిస్తున్నాడు. దీనితో పాటు రౌడీ జనార్దన అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీదే ఉన్నాయి. ఈ సినిమాలు విజయ్ కెరీర్‌లోనే పూర్తి డిఫరెంట్ అటెంప్ట్స్‌గా నిలవబోతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు కూడా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే.. విజయ్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి సై అన్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. టాలీవుడ్‌లో ఇష్క్, మనం లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్, అలాగే 24 లాంటి మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ తీసిన బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar,) తో విజయ్ దేవరకొండ త్వరలో చేతులు కలపబోతున్నాడట. విక్రమ్ కె కుమార్ టేకింగ్, కథను ఆయన ప్రెజెంట్ చేసే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్‌కి మన రౌడీ హీరో యాటిట్యూడ్ తోడైతే.. వెండితెర మీద మ్యాజిక్ జరగడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో వరుస సూపర్ హిట్స్ నిర్మిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్. 'స్త్రీ', 'భేడియా', ముంజ్యా లాంటి హర్రర్ కామెడీ యూనివర్స్ సినిమాలతో మడాక్ ఫిల్మ్స్‌కి నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంది. కంటెంట్ ఉన్న కథలనే నమ్ముకునే ఆ సంస్థ, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాతో ఏకంగా సౌత్ మార్కెట్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయడం విశేషం.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా సైలెంట్‌గా జరుగుతున్నాయని సమాచారం. విక్రమ్ కె కుమార్ చెప్పిన స్టోరీ లైన్ విజయ్‌కి విపరీతంగా నచ్చేసిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే.. విజయ్ ఫ్యాన్స్‌కి ఇది ఒక పెద్ద పండగ లాంటి వార్తే. యాక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలగలిపిన ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని మనం ఆశించవచ్చు. మరి, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్‌తో విజయ్ దేవరకొండతో ఏ తరహా సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.