సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘నాన్న కుట్టి’ ఫస్ట్ హాఫ్ బేస్‌.. సెకండాఫ్ ఎమోషన్: విజయ్ ఆంటోని

ABN, Publish Date - Nov 25 , 2026 | 08:14 AM

విలక్షణ నటుడు విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘నాన్న కుట్టి’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Nanna Kutty Event

విలక్షణ నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony), ప్రీతి అస్రాని (Preethi Asrani) ప్రధాన పాత్రల్లో నటించిన హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘నాన్న కుట్టి’ (Nanna Kutty). విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాతగా.. దర్శకుడు ము. మారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 27న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘నాన్న కుట్టి’ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ బేస్‌లా ఉంటే, సెకండాఫ్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. ఇందులో బేబీ లిథన్య పాత్రతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన భాష్యశ్రీ గారికి, మా చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబుకు ధన్యవాదాలు. నవంబర్ 27న వస్తున్న ‘నాన్న కుట్టి’ అందరికీ తప్పకుండా నచ్చుతుందని తెలిపారు.


నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని మగవాళ్లందరికీ అంకితం చేస్తున్నాను. పదేళ్ల వయసులో నాన్న విలువ తెలియకపోవచ్చు కానీ, వయసు పెరిగేకొద్దీ నాన్న గొప్పదనం అర్థమవుతుంది. చిన్నతనంలోనే మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఉన్నవారే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు. అందరూ గొప్ప తండ్రులు, అన్నదమ్ములుగా ఉండాలని భావోద్వేగంగా చెప్పారు. దర్శకుడు ము. మారన్ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన విజయ్, ఫాతిమా, ఇంకా సురేష్ ప్రొడక్షన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, మంచి కంటెంట్‌తో వస్తున్న తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.


హీరోయిన్ ప్రీతి అస్రాని మాట్లాడుతూ.. అమ్మ ప్రేమను అందరూ సెలెబ్రేట్ చేస్తారు కానీ.. నాన్న ప్రేమను, త్యాగాలను అంతగా చెప్పుకోరు. నాన్న గొప్పదనాన్ని చూపించే ప్రత్యేక చిత్రమిది. ఇందులో ఎమోషన్‌తో పాటు యాక్షన్, కామెడీ అన్నీ ఉన్నాయని అన్నారు. అతిథిగా హాజరైన ‘కిష్కింధపురి’ దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని ఎప్పుడూ నిజాయితీతో కూడిన కథలను ఎంచుకుంటారని ప్రశంసించారు. అలాగే లారా విజయ్ ఆంటోని, సింగర్ మౌషిమి నేహా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. తెలుగు మాటలు, పాటలు అందించిన భాష్యశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్ చూసి చాలాసార్లు ఏడ్చేశాను. కూతురి కోసం ప్రాణాలిచ్చే తండ్రి పాత్రలో విజయ్ ఆంటోని జీవించారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

కచ్చితంగా నో చెప్తా.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ బోల్డ్ ఆన్సర్

‘కింగ్‌ 100’ వాయిదా తప్పదా.. ఇక స్టార్ట్ చేయండయ్యా

‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

Updated Date - Nov 25 , 2026 | 08:14 AM