Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్తేమి కాదు.. శ్రీకాంత్ అరెస్ట్ పై విజయ్ స్పందన
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:04 PM
బిచ్చగాడు (Bichhagadu) సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony).
Vijay Antony: బిచ్చగాడు (Bichhagadu) సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony). ఇక ఈ సినిమా అంతటి విజయాన్ని అందుకోవాలనుకున్న ప్రతిసారి కూడా విజయ్ కు నిరాశే దక్కింది. ఇక బిచ్చగాడు 2 మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తరువాత విజయ్ వరుస సినిమాలతో వచ్చినా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.
ఇక తాజాగా విజయ్ ఆంటోనీ నటిస్తున్న చిత్రం మార్గన్. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్ గా పరిచయమవుతున్నాడు. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ సినిమాలో బ్రిగిడా, ప్రీతిక హీరోయిన్స్ గా నటించారు. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ.. రాజకీయాల గురించి, డ్రగ్స్ కేసుల గురించి మాట్లాడాడు. ఇటీవలే కోలీవుడ్ నటుడు శ్రీరామ్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఇక దాని గురించివిజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ' సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కొత్తేమీ కాదు. ఈ సమస్య ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉంది. ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. శ్రీకాంత్ కు సంబంధించిన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి' అని చెప్పుకొచ్చాడు.
ఇక రాజకీయాల గురించి ఆయన మాట్లాడతూ తనకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, ఇండస్ట్రీలో ఉన్నవారందరూ రాజకీయాల్లోకి రావాలని రూల్ లేదని చెప్పుకొచ్చాడు. ఫేమ్ ఉందని రాజకీయాల్లోకి అడుగుపెట్టలేనని, తనకు అసలు రాజకీయాలపై పెద్ద అవగాహన లేదని, ప్రజలు సమస్యలు ముందు అర్దం చేసుకొనే పరిజ్ఞానం కావాలని ఆయన చెప్పుకొచ్చాడు.
Sreeleela: తప్పుకుందా... తప్పించారా...