సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

ABN, Publish Date - Apr 11 , 2026 | 08:00 PM

దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల తన పేరును ప్రస్తావించే ముందు, తనపై ఆరోపణలు చేసే ముందు.. వాస్తవాలను సరిచూసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరారు. సింగర్ మంగ్లీ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎఫ్.ఐ.ఆర్‌లో కూడా తన పేరు లేదని వేణు ఉడుగుల స్పష్టం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు.

Venu Udugula on Singer Mangli Case

దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల (Venu Udugula) తన పేరును ప్రస్తావించే ముందు, తనపై ఆరోపణలు చేసే ముందు.. వాస్తవాలను సరిచూసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరారు. సింగర్ మంగ్లీ (Singer Mangli) కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎఫ్.ఐ.ఆర్ (FIR)లో కూడా తన పేరు లేదని వేణు ఉడుగుల స్పష్టం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేశారని, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలతో సింగర్ మంగ్లీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితుల నుంచి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లుగా.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ (Panjagutta Police Station)లో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంతమందిపై కేసు నమోదైంది. ఈ కేసులో డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా ఉన్నట్లుగా వార్తలు ప్రత్యక్షమవడంతో.. వెంటనే ఆయన వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో..


‘‘ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో నా పేరు మంగ్లీ కేసుతో అనుసంధానం చేస్తూ వచ్చిన వార్తలు చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ మరియు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు.. ఇద్దరూ నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే నేను సూచించాను. దాని కంటే మించి ఇందులో నేను ఎలాంటి పాత్ర కూడా పోషించలేదు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.


ఈ కేసుకు సంబంధించిన FIRలో కూడా నా పేరు నిందితుడిగా ఎక్కడా ప్రస్తావించబడలేదు. అలాగే, ఈ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావుగారు కూడా ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ, నాకు (వేణు ఉడుగుల) ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విషయానికి సంబంధించిన అతని వీడియో కూడా అందుబాటులో ఉంది. అయితే కొన్ని చోట్ల నిజానిజాలు తెలుసుకోకుండా నా పేరును ఈ వ్యవహారంతో కలిపి ప్రచారం చేయడం బాధాకరం. Punjagutta Police వారు కూడా తమ విచారణలో నాకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం.. ఇవన్నీ కూడా ఇలాంటి వార్తల వల్ల ప్రభావితమవుతాయి. మీడియా మిత్రులు గమనించవలసిందిగా నా వినమ్ర విజ్ఞప్తి. నాపై మీరు చూపిన ప్రేమ, ఆదరణ నాకు ఎప్పుడూ బలం ఇచ్చాయి. అదే విశ్వాసంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని వేణు ఉడుగుల ఈ లేఖలో పేర్కొన్నారు. బాధితుల తరఫు న్యాయవాది సుబ్బారావు చెబుతున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అందులో వేణు హెల్ప్ చేశారని మాత్రమే న్యాయవాది చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

Updated Date - Apr 11 , 2026 | 08:02 PM