Varun Tej: 'కొరియన్ కనకరాజు' వచ్చేస్తున్నాడు...
ABN, Publish Date - Jul 10 , 2026 | 04:32 PM
వరుణ్ తేజ్ తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' ఆగస్ట్ 7న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ చేసి తీస్తున్నారు. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. విశేషం ఏమంటే... కథానుగుణంగా ఈ సినిమా షూటింగ్‌నూ సౌత్ కొరియాలో చిత్రీకరించారు. వారం పాటు అక్కడ కీలక షెడ్యూల్ చేశారు. అందులో పాటలతో పాటు, కథలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పిక్చరైజ్ చేశారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా, సత్య మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్న 'కొరియన్ కనకరాజు' మూవీని ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి కాటసాని, ఎడిటింగ్ సత్యా జి నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్ కరిస్మాటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్ స్టొరీ టెల్లింగ్ తో ఈ సినిమాను అత్యున్నత విలువతో నిర్మిస్తున్నామని ప్రొడక్షన్ హౌసెస్ తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
టాక్సిక్.. బాబోయ్ రెమ్యునరేషన్స్‌కే రూ. 100 కోట్లకు పైగా..!
మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా?
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ
I, Nobody: పృథ్వీరాజ్ సుకుమారన్... ఐ, నోబడీ మూవీ రివ్యూ