సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: 50 భాషల్లో.. జక్కన్న అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

ABN, Publish Date - Aug 24 , 2026 | 03:58 PM

దర్శధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. తాజాగా ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Varanasi Latest Update

దర్శధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కలయికలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లోనే కాకుండా గ్లోబల్ రేంజ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఆ తర్వాత విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్, అలాగే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై ఉన్న హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ విజువల్ వండర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో అలరించబోతున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.


‘వారణాసి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే విషయంలో జక్కన్న ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారట. దాదాపు 120 దేశాల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా... అందులో ఏకంగా 50 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ‘వారణాసి’ గ్లోబల్ మార్కెట్‌ను రీచ్ అవ్వాలంటే భాష చాలా కీలకమైన అంశం. అందుకే ఈ సినిమాను దాదాపు 50 భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు టాక్.

ప్రస్తుతం ఉన్న ఏఐ లేదా సింథటిక్ వాయిస్ టెక్నాలజీతో నటీనటులు ఏ భాషలోనైనా మాట్లాడినట్లు సులభంగా చేయవచ్చు. కానీ రాజమౌళి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రేక్షకులు ఏ దేశంలో ఉన్నా, ఏ భాషలో చూసినా ఆ పాత్రల సంభాషణలు అత్యంత సహజంగా అనిపించాలన్నదే జక్కన్న లక్ష్యం. అందుకే AI కి స్వస్తి చెప్పి, ప్రతి భాషకు ఒరిజినల్ వాయిస్ ఆర్టిస్టులనే ఉపయోగించాలని డిసైడ్ అయ్యారట. డబ్బింగ్‌ను కేవలం డైలాగ్‌ల అనువాదంగా కాకుండా, సినిమా ఆత్మగా భావించే రాజమౌళి.. దాదాపు 1500 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిపించి ఆడిషన్లు నిర్వహించబోతున్నారని సమాచారం. ప్రతి పాత్రకు సరిగ్గా సరిపోయే గొంతును ఎంపిక చేయడం సవాలే అయినప్పటికీ, క్వాలిటీ విషయంలో జక్కన్న ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట.


‘బాహుబలి, RRR’ చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లిన రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి’తో అంతకుమించిన గ్లోబల్ బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని విధంగా ఈ మూవీని ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ ఫీస్ట్‌గా మలుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటోన్న ఈ ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ మూవీతో జక్కన్న-మహేష్ బాబు కాంబో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కేవలం 3 రోజుల్లోనే.. రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్

‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే

సాయి మాచిరాజుతో హీరో ప్రిన్స్ వివాహం.. ఫొటోలు వైరల్

Updated Date - Aug 24 , 2026 | 04:05 PM