‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:35 PM

టాలీవుడ్‌లో మరో కమెడియన్ హీరో అవుతున్నాడు. ఇప్పటి వరకు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మహేష్ (‘రంగస్థలం’ ఫేమ్).. ఇప్పుడు హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Sivalayam Movie Opening

టాలీవుడ్‌లో మరో కమెడియన్ హీరో అవుతున్నాడు. ఇప్పటి వరకు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మహేష్ (‘రంగస్థలం’ ఫేమ్).. ఇప్పుడు హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆచంట మహేష్ (Mahesh Achanta), కాంచన దీప్తిరెడ్డి (Kanchana Deepthi Reddy) హీరోహీరోయిన్లుగా వెంకట్‌ రెడ్డి నంది (Venkat Reddy Nandi) స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శివాలయం’ (Sivalayam). ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రం.. తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు, శ్రేయోభిలాషులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముహూర్తపు సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.


ఈ సందర్భంగా నటుడు, నిర్మాత లెంకల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు, నిర్మాత వెంకట్‌ రెడ్డి గత ఆరు నెలలుగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. దేవుడి పేరుతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ‘శివాలయం’ కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నాకు కూడా ఓ మంచి పాత్రను ఇచ్చారు. మా చిత్ర బృందాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘శివాలయం’ అనే టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. శివుడి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు, కథాంశంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, బలమైన భావోద్వేగాలతో ‘శివాలయం’ రూపుదిద్దుకుంటోంది. ఈ ‘శివాలయం’ ఘన విజయం సాధించి చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.


Sivalayam.jpg

చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకట్‌ రెడ్డి నంది మాట్లాడుతూ.. “శివుడి లీలలు, మహిమలు, భక్తి భావనను ప్రేక్షకులకు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఈ కథపై ఎంతో కాలంగా కసరత్తు చేస్తూ వచ్చాం. గత ఆరు నెలల కాలంలో ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి స్థాయిలో నిర్వహించాం. ప్రేక్షకులకు భక్తితో పాటు మంచి కథ, భావోద్వేగాలు, వినోదాన్ని అందించేలా ఈ సినిమాను రూపొందించనున్నాం. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక అంశాలు, షూటింగ్ వివరాలతో పాటు పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తాం” అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

సాయి మాచిరాజుతో హీరో ప్రిన్స్ వివాహం.. ఫొటోలు వైరల్

‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా

వరుసగా 200 కోట్ల క్లబ్‌లోకి సూర్య.. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ పోస్టర్ వైరల్

Updated Date - Aug 24 , 2026 | 01:35 PM