కేవలం 3 రోజుల్లోనే.. రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:10 PM
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే అద్భుతమైన మౌత్ టాక్‌తో మొదలైన ఈ చిత్ర ప్రభంజనం వీకెండ్ ముగిసేసరికి రికార్డుల సునామీగా మారింది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను (Irumudi 3days Collections) సాధించి అల్టిమేట్ ర్యాంపేజ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఎటువంటి టికెట్ ధరల పెంపు లేకుండా, సాధారణ నాన్-ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ అయి ఒక ప్రాంతీయ (రీజినల్) సినిమాగా అతి తక్కువ సమయంలో రూ. 80 కోట్ల మార్కును అందుకున్న ఫాస్టెస్ట్ చిత్రంగా ‘ఇరుముడి’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. శుక్ర, శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో ఈ చిత్రం సత్తా చాటింది. కుటుంబ ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కూడా రెండో రోజు హౌస్‌ఫుల్ పడిన నేటి రోజుల్లో.. ఈ చిత్రం మాత్రం ఊహించని విధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ.. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, థియేటర్లకు ప్రేక్షకులకు రావడం లేదని ఈ మధ్య విరివిగా వినిపిస్తున్న మాటలకు కూడా ఈ సినిమా స్వస్తి పలికింది. మంచి సినిమా తీస్తే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిరూపిస్తూ.. థియేటర్లలో ‘ఇరుముడి’ దూసుకెళుతోంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ 1 మిలియన్ మార్క్‌ను అందుకుని, రవితేజ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచింది. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న బలమైన భావోద్వేగాలు, తండ్రీకూతుళ్ల అనుబంధం, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రియా భవానీ శంకర్, పాప నక్షత్ర తమ నటనతో సినిమాను మరింత ఉన్నత స్థాయికి చేర్చారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ లాభాల్లోకి ప్రవేశించిన ‘ఇరుముడి’, రాబోయే రోజుల్లో సులభంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి సరికొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే
సాయి మాచిరాజుతో హీరో ప్రిన్స్ వివాహం.. ఫొటోలు వైరల్
‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా