‘వారణాసి’ నుంచి క్రేజీ అప్‌డేట్.. జక్కన్న మాస్టర్ ప్లాన్ అదేనా?
ABN, Publish Date - Sep 17 , 2026 | 05:58 PM
భారతీయ సినీ ప్రియులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ . ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో కీలక అప్డేట్ వైరల్ అవుతోంది.
భారతీయ సినీ ప్రియులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తోన్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి అంతర్జాతీయ హిట్ల తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న సినిమా కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు మరో స్థాయిలో ఉండటంతో ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. అందుకే, ‘వారణాసి’కి సంబంధించిన ఏ చిన్న వార్త లీకైనా సోషల్ మీడియాలో సెకన్లలో వైరల్ అయిపోతోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక సంచలన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటీవల లీకైన షూటింగ్ పిక్స్, అంతర్జాతీయ మీడియాకు రాజమౌళి ఇస్తున్న ఇంటర్వ్యూలతో సినిమాపై ఇప్పటికే బజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సినీ వర్గాల నుంచి ఒక సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. ‘వారణాసి’లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన షూటింగ్ పార్ట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందట. ఈ సినిమా కోసం సుదీర్ఘ సమయాన్ని కేటాయించిన మహేష్ బాబుకు, తన పాత్ర షూటింగ్ పూర్తి కావడంతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక లేట్ చేయకుండా ఆయన త్వరలోనే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ‘వారణాసి’కి సంబంధించిన 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన కొద్దిపాటి భాగాన్ని టీమ్ త్వరలోనే పూర్తి చేయనుందట. దీంతో రాజమౌళి తన దృష్టినంతా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులపైనే పెట్టనున్నారు. విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న నైపుణ్యం ఎలాంటిదో తెలియంది కాదు. కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయించి అవుట్‌పుట్‌ను వరల్డ్ క్లాస్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్‌లో వినపడుతోన్న ఇంకో సంచలన వార్త ఏంటంటే.. ‘వారణాసి’ సినిమాకు ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని జక్కన్న ఆలోచిస్తున్నారట. ఒకవేళ ట్రైలర్ విడుదల చేస్తే రామాయణం ఎపిసోడ్‌లో మహేష్ బాబు గెటప్ లీక్ అయ్యే అవకాశం ఉందని.. ఆ విజన్ అండ్ లుక్‌ని ప్రేక్షకులు నేరుగా థియేటర్లలోనే చూసి సర్‌ప్రైజ్ అవ్వాలని రాజమౌళి భావిస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగా ఇది నిజమైతే మాత్రం ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఇక ట్రైలర్ లేకపోయినా, అభిమానుల కోసం భారీ స్థాయిలో ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ మాత్రం నిర్వహిస్తారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా దాదాపు రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ఈ పాన్ వరల్డ్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్రాత్మక రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
పల్లవి జోషికి సి.బి.ఎఫ్.సి.లో చోటు... విమర్శకులపై విరుచుకుపడ్డ వివేక్ అగ్నిహోత్రి
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే
సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం