సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వారణాసి’.. జక్కన్నకు కొత్త టెన్షన్!

ABN, Publish Date - Jul 16 , 2026 | 04:47 PM

‘బాహుబలి’ నుంచి తన ఒక్కో స్టెప్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉండేలా ప్లానింగ్‌ చేసుకుంటూ వస్తున్నారు జక్కన్న. ఈ ప్లానింగ్‌లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తూ.. రాజమౌళి తెరకెక్కిస్తోన్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’.

Varanasi Movie Team

‘బాహుబలి’ (Baahubali) సిరీస్‌ చిత్రాల తర్వాత రాజమౌళి (SS Rajamouli) పేరు టాలీవుడ్‌ నుంచి ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ‘బాహుబలి’ నుంచి తన ఒక్కో స్టెప్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉండేలా ప్లానింగ్‌ చేసుకుంటూ వస్తున్నారు జక్కన్న. ఈ ప్లానింగ్‌లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ (Varanasi). దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రీ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. టాలీవుడ్‌లోనే తొలి పూర్తి ఐమ్యాక్స్ టెక్నాలజీతో వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్‌గా దీనికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


కానీ, ఇప్పుడు ఈ విజువల్ వండర్‌కు ఐమ్యాక్స్ స్క్రీన్స్‌ రూపంలోనే ఒక ఊహించని పెద్ద సమస్య వచ్చి పడిందని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో దాదాపు 70 శాతానికి పైగా భాగం ఐమ్యాక్స్ ఫుల్‌ స్క్రీన్‌ కెమెరాలతోనే షూట్ చేశారు. అంటే థియేటర్లలో ఆ విజువల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది. ఐమ్యాక్స్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయాలంటే.. దాదాపు 6 నెలల ముందే స్క్రీన్స్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలనేది ఐమ్యాక్స్ యాజమాన్యం రూల్. దానికి తగ్గట్లుగానే హాలీవుడ్ సినిమాలు చాలా కాలం ముందే తమ రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేస్తాయి. ఇప్పుడు ‘వారణాసి’ రిలీజ్ టైమ్‌కు రెండు భారీ హాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీగా నిలబడ్డాయి. అందులో మొదటిది.. గాడ్జిల్లా మాన్‌స్టర్ వర్స్‌లో 6వ భాగంగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: సూపర్ నోవా’. గతంలో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’, ‘ద న్యూ ఎంపైర్’ సినిమాలు వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ క్రేజీ సిరీస్ తదుపరి భాగం వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కాబోతోంది. హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన ఐమ్యాక్స్ స్క్రీన్స్ బుకింగ్స్ కూడా అప్పుడే షురూ అయిపోయాయి.


ఇది చాలదన్నట్టు, ఏప్రిల్ 9న ‘పానిక్ కేర్‌ఫుల్లీ’ అనే మరో భారీ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా టీమ్ సైతం వరల్డ్ వైడ్‌గా ఉన్న ఐమ్యాక్స్ స్క్రీన్స్‌ను తమ వశం చేసుకునేందుకు గట్టిగా ట్రై చేస్తోంది. ఈ రెండు పెద్ద సినిమాల మధ్యలో ‘వారణాసి’కి అంతర్జాతీయంగా ఐమ్యాక్స్ స్క్రీన్స్ దొరుకుతాయా లేదా అనే అనుమానాలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో మొదలయ్యాయి. పరిస్థితిని గమనించిన ఐమ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. ‘వారణాసి’ టీమ్‌కు ఒక కీలకమైన సలహా ఇచ్చిందట. వెంటనే సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటే.. ఆ డేట్ ప్రకారం స్క్రీన్స్ కేటాయించడం ఈజీ అవుతుందని స్పష్టం చేసిందట. అలా ముందే ప్లాన్ చేసుకుంటే ‘వారణాసి’ ఇంటర్నేషనల్ రిలీజ్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. నిజానికి ఇండియా పరంగా ‘వారణాసి’ సినిమాకు ఐమ్యాక్స్ థియేటర్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ కావడం వల్ల, ఇంటర్నేషనల్ స్క్రీన్స్ దక్కించుకోవడంలో ఈ డేట్స్ క్లాష్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. రాజమౌళి ప్లానింగ్ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది కాబట్టి, ఈ గ్లోబల్ హర్డిల్‌ను ‘వారణాసి’ టీమ్ ఎలా దాటుతుందో.. ఐమ్యాక్స్ స్క్రీన్స్‌ను ఎలా సొంతం చేసుకుంటుందో చూడాలి. హాలీవుడ్ సినిమాల పోటీని తట్టుకుని మహేష్ బాబు ‘వారణాసి’ వరల్డ్ వైడ్‌గా ఎన్ని వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..

KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో

మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్

Updated Date - Jul 16 , 2026 | 04:47 PM