సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్

ABN, Publish Date - Sep 10 , 2026 | 11:47 AM

మనోజ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు భక్తి, ఫాంటసీ, డ్రామా కలగలిపి దర్శకుడు తేజ్ ఉప్పలపాటి ఈ ‘వడ్డీ కాసులవాడ’ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఈ పోస్టర్ తెలియజేస్తోంది.

Vaddi Kaasula Vaada New Poster

రాకింగ్ మంచు మనోజ్ (Rawking Manchu Manoj) హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వడ్డీ కాసులవాడ’ (Vaddi Kaasula Vaada). తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏటీవీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో మంచు మనోజ్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బిందాస్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ కాన్సెప్ట్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందన తెచ్చుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. మనోజ్ మార్క్ ఎనర్జీ, క్యాచీ టైటిల్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ విడుదలైంది.

ఈ చిత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) నటిస్తుండటం విశేషం. సెప్టెంబర్ 10న ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ‘Happy Birthday Ravi Mohan’ అంటూ సరికొత్త స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ లుక్స్‌లా కాకుండా చాలా వినూత్నంగా, ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.


ముఖ్యంగా పోస్టర్‌లో చూపించిన దృశ్యం కథలోని ప్రధానాంశాన్ని స్పష్టం చేస్తోంది. ‘‘దొంగకు స్వయంగా ఆ దేవుడే ఆపన్నహస్తం ఇస్తే ఎలా ఉంటుంది?’’ అనే కాన్సెప్ట్‌ను ఈ పోస్టర్ ప్రతిబింబిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పవిత్ర తిరుమల గోపురం, ఆకాశానికి తాకే కొండ మెట్ల మార్గం కనిపిస్తుండగా.. ఫోర్‌గ్రౌండ్‌లో బంగారు కంకణాలు, అమ్మవార్ల ప్రతిమలతో చెక్కిన దివ్యాభరణాలు, నామంతో ఉన్న వేంకటేశ్వర స్వామి దివ్య హస్తం.. ఒక సాధారణ వ్యక్తి (దొంగ) చేతిని బలంగా పట్టుకుని ఉన్నట్లు చూపించారు. ఆ వ్యక్తి చేతికి గోవిందుని ప్రతిమ ఉన్న నల్లటి కంకణం కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


మనోజ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు భక్తి, ఫాంటసీ, డ్రామా కలగలిపి దర్శకుడు తేజ్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. దేవుడికి, దొంగకు మధ్య నడిచే ఆసక్తికరమైన కథనంతో రూపుదిద్దుకుంటున్న ‘వడ్డీ కాసులవాడ’ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. జయం రవి (Jayam Ravi) స్వామివారి పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రం టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ

15 ఏళ్లుగా నాలో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది: ఉదయభాను

మీసం తీసేయ్.. అన్నందుకు మణిరత్నంకు నో చెప్పిన శరత్ కుమార్.. విషయమిదే!

Updated Date - Sep 10 , 2026 | 11:47 AM