15 ఏళ్లుగా నాలో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది: ఉదయభాను
ABN , Publish Date - Sep 10 , 2026 | 10:21 AM
ఉదయభాను.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. యాంకర్‌గా, యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. ఇప్పుడు నిర్మాతగానూ మారుతూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఉదయభాను.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. యాంకర్‌గా, యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను (Udaya Bhanu).. ఇప్పుడు నిర్మాతగానూ మారుతూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదీ ‘పంచనామా’ (Panchanama) అనే వెబ్ సిరీస్‌తో. తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 ఈ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయభాను బాగా ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను మాట్లాడుతూ.. ‘‘వాస్తవానికి ఈరోజు నేను ఎమోషనల్ అవ్వకూడదని అనుకున్నాను. నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా దీని కోసం ఒక తపస్సు చేస్తున్నాను. టెలివిజన్‌లోనే పుట్టాను, ఉదయభాను కాస్తా హృదయభానుగా మారింది అక్కడే. అందుకే టెలివిజన్ నుంచే నా ప్రొడక్షన్ మొదలుపెట్టాలని ఇన్నేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేశానో, ఎంత మంచి కంటెంట్ మోసుకుంటూ ఎక్కడికెక్కడ తిరిగానో నాకే తెలుసు. వచ్చే వారం, వచ్చే నెల మొదలవుతుంది అనుకుంటూనే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరికి నా చిన్ననాటి స్నేహితుడు శ్రీరామ్ ద్వారా ‘జీ’ హెడ్ అనురాధ మేడమ్‌ను కలిశాను. నా దగ్గరున్న కథలు, కాన్సెప్ట్స్ అన్నీ చెబితే ఆమెకు బాగా నచ్చాయి. ఆ తర్వాత వారి ఆలోచనలకు తగినట్లుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.
నా బిడ్డల కోసం నేను ఎలాగైతే తాపత్రయపడతానో.. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే తాపత్రయపడ్డాను. నేను ఫేస్ చేసిన అంశాలన్నీ నాకు అంత కసిని పెంచాయి. ఇంత తక్కువ సమయంలో, ఇంత మంచి క్వాలిటీతో సిరీస్ పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ ఎంతగానో శ్రమించారు. దర్శకుడు, రైటర్ నాగేంద్ర, నేను కలిసి భరత్‌కి కథ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. లక్కీగా ఆయన డేట్లు దొరికాయి. ఎంతో స్టార్‌డమ్ ఉన్న ఆయన సెట్‌లో చాలా కంఫర్టబుల్‌గా పనిచేశారు. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స, కో-ప్రొడ్యూసర్ విజయేంద్ర మౌళి, ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పాటు కాస్టింగ్ డైరెక్టర్ ధనరాజులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 15 ఏళ్లుగా నాలో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది.. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఈ ‘పంచనామా’ సిరీస్ సెప్టెంబర్ 11న జీ5 లో విడుదలవుతోంది, ఇది కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
మీసం తీసేయ్.. అన్నందుకు మణిరత్నంకు నో చెప్పిన శరత్ కుమార్.. విషయమిదే!
హాలీవుడ్ స్క్రీన్స్‌పై ‘రామాయణ’ మేనియా.. ఇంగ్లీష్ ట్రైలర్ అదిరింది
‘సిగ్మా’ స్టోరీ లైన్ చెప్పేసిన జాసన్ సంజయ్.. ఇంట్రెస్టింగ్