‘పెద్ది’ సెట్స్‌లో ‘వాలా 2’ టీమ్.. రామ్ చరణ్ క్రేజ్ మ్యాటర్!

ABN , Publish Date - Apr 23 , 2026 | 08:11 PM

కేరళ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలన చిత్రం ‘వాలా 2’. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ ‘పెద్ది’ని కలిసి, సపోర్ట్ తీసుకున్నారు.

Vaazha 2 Team at Peddi Sets

అందరి సినిమాలు విడుదలవుతున్నాయి.. ‘పెద్ది’ (Peddi) సినిమా మాత్రం విడుదల కావడం లేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో కనీసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కనిపించినా చాలు, వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు. ఆ దర్శన భాగ్యాన్నే ఫ్యాన్స్‌కు కల్పించింది ‘వాలా 2’ టీమ్. కేరళ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలన చిత్రం ‘వాలా 2’ (Vaazha 2). ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి వంటి యువ నటీనటులు నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ ‘పెద్ది’ సెట్స్‌లో ప్రత్యక్షమయ్యారు.


ఈ టీమ్‌ని ఆహ్వానించి, ఆప్యాయంగా మాట్లాడిన మెగా పవర్ స్టార్.. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ మనసు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు పొందిన రామ్ చరణ్‌ని ఇష్టపడని వారు ఎవరుంటారు. అందుకే, ‘వాలా 2’ టీమ్ ప్రత్యేకంగా రామ్ చరణ్‌ని కలిసి, వారి ఆనందాన్ని తెలియజేశారు. ‘పెద్ది’ సెట్‌కు వచ్చిన టీమ్ అందరితో చరణ్ ఫొటోలు దిగి, వారిని సంతోషంగా పంపించారు.


ఇక ‘వాలా 2’ విషయానికి వస్తే, సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో ఒకరు సాహు గారపాటి (Sahu Garapati). తెలుగు నిర్మాత అయిన సాహు గారపాటి, తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై.. విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. మలయాళంలో ఇప్పటికే 200 కోట్లు రాబట్టిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఏప్రిల్ 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రీసెంట్‌గానే నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి, యూనిట్‌ను అభినందించారు.

ఇవి కూడా చదవండి:

ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!

ధనుష్ - మృణాల్.. మళ్లీ మొదలు! అసలు విషయం ఏమిటంటే?

చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?

Updated Date - Apr 23 , 2026 | 08:21 PM

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది

Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే

Peddi Song: ‘పెద్ది సాంగ్‌.. బుచ్చి భలే ప్లాన్‌ చేశాడు..

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..