హాలీవుడ్ స్క్రీన్స్‌పై ‘రామాయణ’ మేనియా.. ఇంగ్లీష్ ట్రైలర్ అదిరింది

ABN , Publish Date - Sep 10 , 2026 | 08:55 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రీతిలో, ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి అంతర్జాతీయ సినిమాగా రూపొందుతున్న విజువల్ వండర్ ‘రామాయణ’. ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Ramayana Trailer

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రీతిలో, ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి అంతర్జాతీయ సినిమాగా రూపొందుతున్న విజువల్ వండర్ ‘రామాయణ’ (Ramayana: Part 1). నితీష్ తివారి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ మైథలాజికల్ విజువల్ ఎపిక్ కోసం గ్లోబల్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ థియేటర్లలో భారతీయ సినిమా సత్తాను చాటిచెబుతున్నారు.


ఓవర్సీస్‌లోని ప్రముఖ అంతర్జాతీయ చిత్రాల ప్రదర్శనల వద్ద 1 నిమిషం 22 సెకన్ల నిడివితో కూడిన ‘రామాయణ’ ఇంగ్లీష్ స్పెషల్ ట్రైలర్ కట్‌ను మేకర్స్ అటాచ్ చేశారు. తాజాగా కెనడాలోని మల్టీప్లెక్స్‌లలో భారీ విజయాన్ని అందుకున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) స్క్రీనింగ్ సందర్భంగా ప్రదర్శించిన ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారీ స్క్రీన్‌పై రణబీర్ కపూర్ (శ్రీరాముడు), రాకింగ్ స్టార్ యశ్ (రావణాసురుడు), సాయి పల్లవి (సీత)ల అద్భుత రూపాలు, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, హన్స్ జిమ్మెర్ - ఏఆర్ రెహమాన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు విదేశీ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.


గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని ప్రఖ్యాత సోనీ పిక్చర్స్ (Sony Pictures) సంస్థ దాదాపు 50,000 అంతర్జాతీయ స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. విదేశీయులను సైతం ఆకట్టుకునేలా ప్రత్యేక ఏఐ లిప్-సింక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఇంగ్లీష్ ట్రైలర్ కట్‌ను ప్రధాన హాలీవుడ్ చిత్రాలతో జతచేయడం సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానున్న ‘రామాయణ’ పార్ట్-1.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘సిగ్మా’ స్టోరీ లైన్ చెప్పేసిన జాసన్‌ సంజయ్‌.. ఇంట్రెస్టింగ్

ప్రభాస్ రేసు నుంచి తప్పుకుంటే.. ఆ ముగ్గురిదే హవా

టాలీవుడ్‌లో శ్రీలీల చాప్టర్ క్లోజా?

Updated Date - Sep 10 , 2026 | 08:55 AM