‘సిగ్మా’ స్టోరీ లైన్ చెప్పేసిన జాసన్‌ సంజయ్‌.. ఇంట్రెస్టింగ్

ABN , Publish Date - Sep 10 , 2026 | 08:24 AM

సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘సిగ్మా’ చిత్రం అక్టోబర్‌ 2న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ చిత్రంతో సీఎం విజయ్ తనయుడు జాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Sigma Pre Release Event

మనందరి జీవితాల్లో ఖచ్చితంగా ‘సిగ్మా’ (Sigma) క్షణం ఉంటుందని, అదే మన జీవితాలను మార్చేసి కష్ట సమయాల నుంచి కోలుకోవడానికి తీసుకునే ఒక నిర్ణయం అవుతుందని, అదే ‘సిగ్మా’ సినిమా స్టోరీ అని.. చిత్ర దర్శకుడు జాసన్‌ సంజయ్‌ (Jason Sanjay) అన్నారు. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘సిగ్మా’ చిత్రం అక్టోబర్‌ 2న గ్రాండ్‌గా విడుదలకానుంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై జీకేఎం తమిళ్‌కుమరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో సేలంలో నిర్వహించిన ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు జాసన్‌ సంజయ్‌ మాట్లాడుతూ.. ఈ మూవీ ప్రమోషన్‌ సేలం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో పది రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. ఇక్కడ నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. అక్టోబరు 2న విడుదలయ్యే ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సుభాస్కరన్‌, తమిళ్‌ కుమరన్‌, చిత్ర బందం, నా కుటుంబానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.


హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవానికి జాసన్‌ ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించారు. ‘సిగ్మా’ ఖచ్చితంగా సక్సెస్‌ సాధిస్తుందన్నారు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడు జాసన్‌కు సినీ నిర్మాణం, చలనచిత్ర రంగంపై చాలా అభిరుచి వుందన్నారు.


నిర్మాత తమిళ్‌ కుమరన్‌ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ మూవీ జాసన్‌ సంజయ్‌కు మాత్రమే కాదు. మా బ్యానర్‌కు కూడా చాలా ముఖ్యమైనది. మా బ్యానరులో జాసన్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం గర్వకారణంగా ఉంది. జాసన్‌ మేకింగ్‌లో అద్భుతంగా రాణిస్తాడు. ‘కోలమావు కోకిల’తో నెల్సన్‌ దిలీప్ కుమార్‌ను, ‘డాన్‌’ మూవీతో సిబి చక్రవర్తిని దర్శకులుగా పరిచయం చేశాం. ఇపుడు వారిద్దరు స్టార్‌ దర్శకులుగా ఉన్నారు. జాసన్‌ కూడా గొప్ప శిఖరాలను చేరుకుంటాడని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్ రేసు నుంచి తప్పుకుంటే.. ఆ ముగ్గురిదే హవా

టాలీవుడ్‌లో శ్రీలీల చాప్టర్ క్లోజా?

అతనితో రిలేషన్ వర్కవుట్ కాలేదు.. ఆ తర్వాత ఎవరితో కమిట్ కాలేదు: కావ్యశ్రీ

Updated Date - Sep 10 , 2026 | 08:25 AM