90స్ స్టార్స్‌కు ట్రిబ్యూట్‌లా ‘తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ’ ఈవెంట్.. ఏం ప్లాన్ చేశారయ్యా!

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:27 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజు పల్లి టీవీ‘. ఆయన నటించిన సినిమా అయినా, లేక నిర్మించిన సినిమా అయినా సరే.. ప్రమోషన్స్ విషయంలో కిరణ్ అబ్బవరం రూటే సెపరేటు అన్నట్లుగా ఉంటుంది. అదే విషయాన్ని మరోసారి నిరూపించారు కిరణ్ అబ్బవరం అండ్ టీమ్.

Thimmarajupalli TV Event

నేడు సినిమాను నిర్మించడం ఎంత ముఖ్యమో, దానిని ప్రమోట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడానికి చిత్రయూనిట్ నానా కష్టాలు పడుతోంది. సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచి, థియేటర్లలోకి సినిమా వచ్చే వరకు ఎన్నో రకాల ప్రమోషన్స్ నిర్వహించాల్సి వస్తోంది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ మొదలుకుని ప్రీ రిలీజ్ వేడుక వరకు, అలాగే సినిమా విడుదల తర్వాత థ్యాంక్యూ మీట్, సక్సెస్ మీట్.. ఇలా ఏదో రకంగా సినిమాను వార్తలలో ఉంచాల్సిందే. అంత చేస్తేనే, సినిమా జనాల్లోకి వెళుతుంది. అయితే ఇందులో కూడా నార్మ‌ల్‌గా ఈవెంట్స్ చేస్తే, పెద్దగా ఉపయోగం ఉండదు. ఏదో ఒక వెరైటీ మాత్రం కచ్చితంగా ఉండాలి. ఇప్పుడదే ప్లాన్ చేశారు ‘తిమ్మరాజు పల్లి టీవీ’ (Thimmarajupalli TV) చిత్రబృందం. ఈ సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమా అయినా, లేక నిర్మించిన సినిమా అయినా సరే.. ప్రమోషన్స్ విషయంలో కిరణ్ అబ్బవరం రూటే సెపరేటు అన్నట్లుగా ఉంటుంది. అదే విషయాన్ని మరోసారి నిరూపించారు కిరణ్ అబ్బవరం అండ్ టీమ్.


అవును, గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘తిమ్మరాజు పల్లి టీవీ’ ట్రైలర్ రిలీజ్ వేడుక (Trailer Launch Event)ను చాలా వెరైటీగా నిర్వహించారు. ఈ వేడుకకు సినిమాలో నటించిన వారంతా, సినిమాలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులకు తెలిసేలా 90స్ నాటి తారల (90s Stars) అవతారంలో రావడం విశేషం. 90స్‌లో టీవీ ఉంటే, వాళ్లు చాలా గొప్పవారు అన్నట్లుగా ఉండేది. ఆ టీవీ ఉన్న ఇంటికి చుట్టు పక్కలా ఒక కి.మీ. వరకు ఉన్న జనం అంతా వచ్చి చూస్తూ.. ఒక థియేటర్‌ని తలపించేవారు. అప్పటి హీరోల సినిమాలను టీవీలలో చూసి ఎంతో ఆనందించేవారు. ఇప్పుడు ఎన్ని మల్టీప్లెక్స్‌లు వచ్చినా, రకరకాల టీవీలు వచ్చినా, ఇంటిలో రెండు మూడు టీవీలు, లాప్‌ట్యాప్‌లు, ఫోన్లు ఉన్నా.. అప్పటి ఆనందాన్ని మాత్రం పొందలేకపోతున్నారని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ని మళ్లీ ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి టీమ్ చెబుతోంది. అదే విషయాన్ని ట్రైలర్ లాంచ్ వేడుక ద్వారా మరోసారి టీమ్ చాటి చెప్పింది. 90స్ స్టార్స్‌కు ట్రిబ్యూట్‌లా, వారి గెటప్స్‌లో రావడం, స్టేజ్‌పై సందడి చేయడం.. వంటి వన్నీ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా చేశాయి. అందుకే చెప్పింది.. తను హీరోగా నటించిన సినిమాకే ప్రాణం పెట్టే కిరణ్ అబ్బవరం, ఇక నిర్మించే సినిమా కోసం ఇంకెంతగా ఆలోచిస్తాడో అనేదానికి జస్ట్ ఎగ్జాంపుల్ అనేలా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఉందంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ వేడుకకు ఆయన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ మూవీలోని బాలయ్య అవతారంలో రావడం, సినిమా ట్రైలర్‌ ‘పాలకొల్లు పాప’ అంటూ బాలయ్య సాంగ్‌తో మొదలవడం అన్నీ కూడా బాగా పేలాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల గెటప్స్‌లో సినిమాలో నటించిన నటులు వస్తే.. హీరోయిన్లు అప్పటి హీరోయిన్లను తలపించే డ్రస్సుల్లో ప్రత్యక్షమయ్యారు. మొత్తంగా అయితే ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి.

Kiran-and-Team.jpg


ఇక ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ వి. మునిరాజు (V Muniraju) మాట్లాడుతూ, చాలా గొప్పగా మాట్లాడారు. ‘‘అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మాత్రం, మా సినిమాను ఈనెల 17న థియేటర్లలో చూడాల్సిందే. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ అన్నీ చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు.. మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు 5 కోట్ల మందికి పైగా ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే, అందరూ ఫ్యామిలీతో కలిసి వస్తే కచ్చితంగా ఎంజాయ్ చేసి వెళ్తారు’’ అని చెప్పుకొచ్చారు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

Updated Date - Apr 09 , 2026 | 08:27 PM