‘ది రెడ్ బ్యాగ్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే!

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:36 PM

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సరికొత్త సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీ విడుదలకు డేట్ ఫిక్సయింది.

The Red Bag Ready to Release

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సరికొత్త సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). రవి కుమార్ సీరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రముఖ కమెడియన్ ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇంటెన్స్ గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై సినీ ప్రియుల్లో భారీగా ఆసక్తిని, అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు సైతం యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతూ ట్రెండింగ్‌గా నిలిచాయి.


ఈ ఆసక్తికర చిత్ర విడుదలకు చిత్ర బృందం అధికారికంగా ముహూర్తం ఖరారు చేసింది. అన్ని హంగులూ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’ సినిమాను ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలలో ఓ విశేషం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను, క్రేజీ ప్రాజెక్ట్‌లను పంపిణీ చేసి ఘన విజయాలు అందుకున్న దిగ్గజ సంస్థ ‘పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్’ (PVR INOX Pictures) వారు ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఆ సంస్థ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ముందుకు రావడం ప్రాజెక్ట్‌కు అతిపెద్ద బలంగా మారింది.


ఆగస్ట్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. బలమైన కథ, ఆకట్టుకునే కథనంతో రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో రాబోయే రోజుల్లో సరికొత్త ప్రమోషనల్ కంటెంట్, అదిరిపోయే ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ను మరింత పెంచేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. మంచి కంటెంట్, ప్రముఖ పంపిణీ సంస్థ అండ కలవడంతో ‘ది రెడ్ బ్యాగ్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

లక్ష మంది యువతులకు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరుదైన ఘనత

‘అమీర్ లోగ్’.. భాష, యాసతో సంబంధం లేకుండా భావోద్వేగాలతోనే..

ప్రభాస్, ఎన్టీఆర్ మూవీస్‌తో మైత్రీ కొత్త ట్రెండ్.. బాక్సాఫీస్ బద్దలే ఇక!

Updated Date - Aug 16 , 2026 | 07:36 PM