ప్రభాస్, ఎన్టీఆర్ మూవీస్‌తో మైత్రీ కొత్త ట్రెండ్.. బాక్సాఫీస్ బద్దలే ఇక!

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:36 PM

టాలీవుడ్‌లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ రూటే వేరు.

Mythri Movie Makers Lineup

టాలీవుడ్‌లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూటే వేరు. ‘శ్రీమంతుడు’తో జర్నీ స్టార్ట్ చేసిన ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘ఉప్పెన’, పాన్ ఇండియా రేంజ్‌లో ‘పుష్ప’ ప్రాంచైజీలతో పాటు దాదాపు 25కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్న మైత్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక భారీ ప్లాన్‌తో సరికొత్త లైనప్‌ను సిద్ధం చేసింది.


సాధారణంగా ఒకే సంస్థ ప్రెజెంట్ ట్రెండ్‌ను బేస్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేయడం చూస్తుంటాం. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాబోయే ప్రాజెక్టుల కోసం వేర్వేరు చారిత్రక కాలాలను ఎంచుకుంటోంది. కాలాన్ని రీక్రియేట్ చేస్తూ వెండితెరపై వింటేజ్ అనుభూతిని పంచే పీరియడ్ జోనర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ఒకే సమయంలో, వేర్వేరు టైమ్‌లైన్లలో నడిచే భారీ ప్రాజెక్టులను ఒకే బ్యానర్‌లో హ్యాండిల్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో రానున్న ‘రణబాలి’ (Ranabaali). ఈ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేలల్లోకి తీసుకెళ్లనుంది. ఆ నాటి జీవన విధానం, స్థానిక పోరాటాలు, ఆచారాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ ఏకంగా రెండున్నరేళ్లు లోతైన పరిశోధన చేశారు. నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi) మరో వింటేజ్ విజువల్ వండర్. స్వాతంత్య్రానికి పూర్వం, బ్రిటిష్ పాలన నాటి తిరుగుబాటు నేపథ్యంలో ఈ కథ నడవనుంది. నాటి మిలిటరీ వాతావరణం, వింటేజ్ లొకేషన్లతో కూడిన ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు భారీ ఎత్తున సెట్స్ వేస్తున్నారు.


మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon) సైతం 1960ల నాటి బ్యాక్‌డ్రాప్‌లోనే రాబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నీల్ మార్క్ డార్క్ విజువల్స్‌తో నాటి కాలాన్ని ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మొదట అనుకున్న హిస్టారికల్ లైన్ మారినప్పటికీ, ఫ్యూచర్‌లో అలాంటి చారిత్రక సబ్జెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. గతంలో ‘రంగస్థలం’తో 1980ల నాటి పల్లెటూరిని, ‘పుష్ప’తో శేషాచలం అడవుల నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ట్రాక్ రికార్డ్ మైత్రీ సొంతం. అయితే అప్పుడు ఒకే సినిమాతో పరిమితమైన ఈ సాహసం.. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోలతో వివిధ కాలాలను రీక్రియేట్ చేసే స్థాయికి చేరింది. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా భారీ వ్యయంతో కూడుకున్న ఇలాంటి పీరియడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అడివి శేష్ వదిలిన ‘అ’ ఫస్ట్ లుక్.. టైటిల్ జస్టిఫికేషన్ ఇదే

రామ్ చరణ్‌‌కు కాదు.. కెవిన్ కుంటా ఇప్పుడెవరి బాడీగార్డో తెలుసా

‘ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే

Updated Date - Aug 16 , 2026 | 05:36 PM