‘అమీర్ లోగ్’.. భాష, యాసతో సంబంధం లేకుండా భావోద్వేగాలతోనే..

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:00 PM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు.

Ameer Log Team

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log Movie). ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్రంలోని ప్రధాన పాత్రధారులైన MC హరి, మనోజ్, శశిధర్ చిత్ర విశేషాల్ని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..


‘‘ఈ సినిమా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాని చూసినట్టుగా ఉండదు. హైదరాబాద్ బస్తీలోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా డైరెక్టర్ అత్తగారి ఇల్లు, ఆ బస్తీలోనే షూటింగ్ చేశాం. అక్కడి వాళ్లంతా మా అందరినీ ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. సింక్ సౌండ్‌లో ఈ మూవీ ఉంటుంది. అందుకే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. పైనా విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఆపేసేవాళ్లం. రోడ్ల మీద తీసిన సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. అది కూడా దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంటుంది. మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా అనిపించింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. రమణ అన్న ఎంతో నేచురల్‌గా, ఎంతో సింపుల్‌గా సినిమాని తీశారు. ఇందులో బిర్యానీ అనేదే మెయిన్ పాయింట్. ఆ బిర్యానీ చుట్టూనే మా పాత్రలు తిరుగుతాయి. అది ఏంటి? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని చూస్తే బిర్యానీ వాసన వస్తుంది. సెకండాఫ్‌లో బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. క్లైమాక్స్‌కి కడుపు నిండినట్టు అనిపిస్తుంది.


తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా.. సినిమాలో మాత్రం మహిళా పాత్రలే కీలకంగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. సినిమా చూశాక మా అందరికీ ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. మంచి ప్రొడక్ట్ మా చేతుల్లో ఉంది. దాన్ని ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాం. రానా టీం మా సినిమాను చూసింది. హైదరాబాద్‌లో ముందు ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత అన్ని ఏరియాల్లో కవర్ చేయండని రానా చెప్పారు. త్వరలోనే ఆయన కూడా సినిమాని చూస్తారు. రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండేలా కాకుండా ఇందులో హిందీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, హైదరాబాద్ అంటే తెలీకుండానే కొన్ని పదాల్లో హిందీ, ఉర్దూ వచ్చేస్తుంది. మరీ హై లెవెల్లో కాకుండా సాధారణ జనాలకు అర్థమయ్యేలానే భాషను వాడాం. ఇక్కడి భాషకి, యాసకి అడ్రెస్‌లా మా ‘అమీర్ లోగ్’ సినిమా ఉంటుంది. భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుందని, మంచి సక్సెస్ అవుతుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్, ఎన్టీఆర్ మూవీస్‌తో మైత్రీ కొత్త ట్రెండ్.. బాక్సాఫీస్ బద్దలే ఇక!

అడివి శేష్ వదిలిన ‘అ’ ఫస్ట్ లుక్.. టైటిల్ జస్టిఫికేషన్ ఇదే

రామ్ చరణ్‌‌కు కాదు.. కెవిన్ కుంటా ఇప్పుడెవరి బాడీగార్డో తెలుసా

Updated Date - Aug 16 , 2026 | 07:00 PM