సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రీజనబుల్‌గానే.. ‘ద ప్యారడైజ్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN, Publish Date - Sep 20 , 2026 | 07:18 PM

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’. ఈ చిత్రయూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

The Paradise

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఈ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. నాని కెరీర్‌లోనే ఇప్పటి వరకు లేనంతగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తుండగా.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విడుదలయ్యే తేదీలు, టికెట్లపై పెంచిన రేట్ల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


స్పెషల్ ప్రీమియర్ షో

సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందే, అంటే సెప్టెంబర్ 23న సాయంత్రం 06:30 గంటలకు ఒక ప్రత్యేక షో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ షోకి టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500 గా నిర్ణయించారు.

సింగిల్ స్క్రీన్స్ (Single Screens):

సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు (మొదటి 4 రోజులు): ఒక్కో టికెట్‌పై జీఎస్టీతో కలిపి రూ. 48 పెంచుకునే వెసులుబాటు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 03 వరకు: ఒక్కో టికెట్‌పై జీఎస్టీతో కలిపి రూ. 23 పెంచుకోవచ్చు.


మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లు (Multiplexes/Special Theatres):

సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు (మొదటి 4 రోజులు): ఒక్కో టికెట్‌పై జీఎస్టీతో కలిపి రూ. 95 పెంచుకునేందుకు అనుమతి.

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 03 వరకు: ఒక్కో టికెట్‌పై జీఎస్టీతో కలిపి రూ. 45 పెంచుకోవచ్చు.

అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సినీ కార్మికుల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం:

ఈ వెసులుబాటు కల్పించినందుకు గాను నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ.. సినీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ’ అకౌంట్‌కు తప్పనిసరిగా రూ. కోటి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే థియేటర్లలో మాదకద్రవ్యాల నివారణ (యాంటీ డ్రగ్స్), సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

‘కోకో కొకొరొకో’.. అదిరిపోయే ఐటమ్‌తో వచ్చిన ‘ముగ్గురు కోతులు’

చిరు లీక్స్: ‘కాకా’ క్యారెక్టర్ పేరు లీక్.. ఎంత పని చేశావ్ స్రవంతి?

ట్రోలర్లకు వార్నింగ్.. బిగ్‌బాస్‌లో షర్ట్ విప్పి సల్మాన్ రచ్చ

Updated Date - Sep 20 , 2026 | 07:32 PM