ట్రోలర్లకు వార్నింగ్.. బిగ్‌బాస్‌లో షర్ట్ విప్పి సల్మాన్ రచ్చ

ABN , Publish Date - Sep 20 , 2026 | 02:44 PM

సోషల్ మీడియా యుగంలో ఎదుటివారి రూపాన్ని బట్టి జడ్జ్ చేయడం, ఎవరినో ఒకరిని నిరంతరం ట్రోల్ చేయడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. తాజాగా అలాంటి ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చారు భాయిజాన్ సల్మాన్.

Salman Khan

సోషల్ మీడియా యుగంలో ఎదుటివారి రూపాన్ని బట్టి జడ్జ్ చేయడం, ఎవరినో ఒకరిని నిరంతరం ట్రోల్ చేయడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ బాడీ షేమింగ్, ట్రోలింగ్ బారిన పడకుండా తప్పించుకోలేకపోతున్నారు. అయితే, ఇలాంటి ఆన్‌లైన్ విమర్శలు, నెగెటివిటీపై ఇతరుల అభిప్రాయాలతో పనిలేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎలా బతకాలో చాటిచెప్పారు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan). బిగ్‌బాస్ 20 (Bigg Boss 20) వేదికగా ఆయన చేసిన పని ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

షో రన్నింగ్‌లో ఉండగానే ఒక్కసారిగా తన చొక్కా విప్పేసిన సల్మాన్ ఖాన్.. సిక్స్ ప్యాక్, అదిరిపోయే ఫిజిక్‌ను చూపిస్తూ ట్రోలర్లకు గట్టి సవాలు విసిరారు. ‘‘రండి.. నన్ను ట్రోల్ చేయాలనుకుంటున్నారా? చేయండి! క్లోజప్ తీసుకోండి.. నా బాడీపై ఏమైనా మేకప్ ఉందేమో తుడుచుకుని మరీ చూపిస్తా’’ అంటూ తన క్రూ మెంబర్‌ని పిలిచి ఒంటిపై ఉన్న చెమటను టవల్‌తో తుడిపించి మరీ తన నేచురల్ బాడీని చూపించారు. ఆ సమయంలో వేదికపై ఉన్న కంటెస్టెంట్లు సల్మాన్ డెడికేషన్, ఫిట్‌నెస్‌ను చూసి షాక్ అయిపోయి ఈలలు, చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.


అనంతరం ట్రోలర్లకు గట్టి క్లాస్ ఇస్తూ, సల్మాన్ ఖాన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎదుటివారిపై కామెంట్లు చేసే ముందు.. అసలు మీ మొహం అద్దంలో చూసుకోండి! మీ శరీరం ఎలా ఉందో చూసుకోండి.. ఆ తర్వాత మాట్లాడండి. అంతకంటే ముందు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, వాళ్ల ఆరోగ్యాన్ని పట్టించుకోండి.. ఆ తర్వాతే ఇతరులపై పడి ఏడవండి,. ‘భాయ్.. మీరు బరువు తగ్గారా? పెరిగారా?’ అని ఆందోళనతో అడిగితే అర్థం ఉంటుంది.. కానీ పనిగట్టుకుని ట్రోల్ చేసేవాళ్లకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అంటూ ముఖం మీదే తేల్చిచెప్పేశారు.


ఇది కేవలం ఒక టీవీ షోలో జరిగిన సరదా ఘట్టం మాత్రమే కాదు.. తనపై వచ్చే ప్రతి విమర్శను బద్దలు కొడుతూ సల్మాన్ ఇచ్చిన పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్. ‘‘నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, నన్ను మీరు ఎలా చూస్తారనేది మీ సమస్య మాత్రమే’’ అనే విషయాన్ని ఆయన నిరూపించారు. నిజమైన ఆత్మవిశ్వాసం అంటే అందరూ మనల్ని మెచ్చుకోవడం కాదు.. అందరూ వ్యతిరేకించినా మనల్ని మనం ప్రేమించుకోగలగడం, ఇతరుల జడ్జిమెంట్ల కోసం బతకకుండా ఉండటమే అసలైన స్వేచ్ఛ అని సల్మాన్.. ఈ చర్య స్పష్టం చేస్తోంది. 60 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా ఈ స్థాయిలో కఠిన కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం సల్మాన్‌కే సాధ్యమంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ

ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి

‘వారణాసి’ కోసం రంగంలోకి నార్వే వీఎఫ్ఎక్స్ దిగ్గజం.. జక్కన్నా, నీకో దండం సామి!

Updated Date - Sep 20 , 2026 | 02:44 PM