‘కోకో కొకొరొకో’.. అదిరిపోయే ఐటమ్‌తో వచ్చిన ‘ముగ్గురు కోతులు’

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:04 PM

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీ ఐటమ్ నంబర్‌ని తాజాగా మేకర్స్ వదిలారు.

Mugguru Kothulu Item Song

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu). తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించగా.. తాజాగా మాస్, యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే అదిరిపోయే ఐటమ్ నంబర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘కోకో కొకొరొకో’ (Ko Ko Kokoroko Song) అంటూ సాగే ఈ మాస్ పెప్పీ సాంగ్ గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక ఈ పాట విషయానికి వస్తే..


‘‘కో కో కొకొరొకో కో కో.. నేనో నాటుకోడి వచ్చి చూసుకో.. వందో నోటు చేతికిచ్చి నన్ను తీసుకో’’ అంటూ సాగే పల్లవి శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా క్యాచీగా సాగింది. లిరిసిస్ట్ జగదీష్ అందించిన మాస్ సాహిత్యం, లాస్య ప్రియ హస్కీ అండ్ ఎనర్జిటిక్ వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ కంపోజ్ చేసిన మాస్ బీట్ యూత్‌కు ఇన్స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది.

Rajendra-Prasad.jpg

వినోద్, రఘు, సాయి కొరియోగ్రఫీలో ముగ్గురు హీరోలతో కలిసి డ్యాన్సర్ వేసిన మాస్ స్టెప్పులు, గ్లామరస్ మూమెంట్స్ విజువల్‌గా ఆకట్టుకుంటున్నాయి. రాజ్ నోముల కెమెరా పనితనం, జమీర్ షేక్ ఎడిటింగ్ ఈ పాటను మరింత కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌ను మేకర్స్ వరుసగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరు లీక్స్: ‘కాకా’ క్యారెక్టర్ పేరు లీక్.. ఎంత పని చేశావ్ స్రవంతి?

ట్రోలర్లకు వార్నింగ్.. బిగ్‌బాస్‌లో షర్ట్ విప్పి సల్మాన్ రచ్చ

ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ

Updated Date - Sep 20 , 2026 | 06:04 PM